Nithiin : కొంతమందికి విపరీతమైన టాలెంట్ ఉన్నా కూడా సరైన హిట్ సినిమాలు ఉండవు. ఎన్నో అంచనాలతో సినిమాలు వస్తున్న కూడా అవి డిజాస్టర్ అవుతుంటాయి. ఈ టాపిక్ విషయానికి వస్తే హీరో నితిన్ గురించి మాట్లాడుకోవాలి. నితిన్ లో విపరీతమైన టాలెంట్ ఉంది. దానిలో ఎటువంటి డౌటు లేదు. కానీ నితిన్ కి హిట్ సినిమా పడటం లేదు. ఎన్నో అంచనాలు పెట్టుకుని చేస్తున్న కూడా అవి బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయి.
జయం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్. బాక్సాఫీస్ వద్ద జయం సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్ సినిమా కూడా మంచి సక్సెస్ అయింది. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా తర్వాత పది సంవత్సరాలు వరకు నితిన్ కెరియర్ లో హిట్ సినిమాలు లేకుండా పోయింది. మళ్లీ ఇష్క్ సినిమాతో కం బ్యాక్ ఇచ్చాడు.
ఇకపోతే నితిన్ ప్రస్తుతం లిటిల్ హార్ట్స్ దర్శకుడు సాయిమార్తాండ కథను విన్నాడట. ఏషియన్ ఫిలిమ్స్ లో సాయిమార్తాండ నితిన్ కి కథను చెప్పాడు. ఇది ఫైనల్ అయ్యే దశలో ఉంది.
ఒకవేళ ఇది కాని వర్కౌట్ అయితే నితిన్ తీసుకున్న మంచి నిర్ణయం ఇది అని చెప్పాలి. అది చాలా చిన్న బడ్జెట్ సినిమా అయినా కూడా నితిన్ కు ఇప్పుడు పెద్ద హిట్ అవసరం. ఒకవేళ స్టోరీ డిమాండ్ చేస్తే రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా నితిన్ పని చేస్తాడు అని వినికిడి.
ఈ సబ్జెక్ట్ వర్కౌట్ అయితే త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. గతంలో కూడా 90s దర్శకుడు ఆదిత్య హాసన్ నితిన్ సినిమా ఉండబోతుంది అని వార్తలు వచ్చాయి. ఆదిత్య ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమ్ముడు సినిమా ఎఫెక్ట్ కొట్టడం వలన లాస్ట్ కి లిటిల్ హార్ట్స్ దర్శకుడిని నమ్ముకోవాల్సి వస్తుంది అనేది కొందర అభిప్రాయం.
నితిన్ కెరియర్లో చాలామంది పెద్ద దర్శకులతో పనిచేశాడు. పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, వివి వినాయక్, ఎస్.ఎస్ రాజమౌళి ఈ దర్శకులతో పనిచేసినప్పుడు నితిన్ మంచి సక్సెస్ లే అందుకున్నాడు. కానీ మిగతా దర్శకులు మాత్రం ఊహించిన సక్సెస్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ దర్శకులు నితిన్ తో సినిమా చేసే స్థాయిలో లేరు. వాళ్ళని నమ్ముకుని నితిన్ కూర్చోలేడు.
విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కం బ్యాక్ అయింది. ఎక్కడినుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నితిన్ ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. కంటెంట్ లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలే ఈ రోజుల్లో ఆడడం లేదు. ఇంక మిగతా సినిమాలు ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఏదైనా ఈ లిటిల్ హార్ట్స్ దర్శకుడు ప్రాజెక్ట్ ఏమవుతుందో చూడాలి.
Also Read: Sai Tej : అల్లు అర్జున్ గురించి సాయి తేజ్ లేటెస్ట్ కామెంట్స్, ఆయన ఇప్పుడు గొప్పోళ్ళు అయిపోయారు