BigTV English

K- Ramp Trailer delay : ఈ దర్శక నిర్మాతలు మారరా, ప్రేక్షకులతో ఆడుకోవడమే పని అయిపోయిందా

K- Ramp Trailer delay : ఈ దర్శక నిర్మాతలు మారరా, ప్రేక్షకులతో ఆడుకోవడమే పని అయిపోయిందా

K- Ramp Trailer delay :తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని చాలామంది దర్శక నిర్మాతలు అభిమానులను గ్రాంటెడ్ గా తీసుకోవడం మొదలుపెట్టారు. చాలామంది జీవితాల్లో ఉన్న ఏకైక వినోదం సినిమా. సినిమా థియేటర్లో కూర్చుంటే ఒక ప్రేక్షకుడు కనీసం మూడు గంటల పాటు తనకున్న వ్యక్తిగత సమస్యలను మర్చిపోయి సినిమాలో నిమగ్నం అవుతాడు. చాలామందికి సినిమా ఒక ఓదార్పు.


అందుకే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు సినిమాల గురించే మాట్లాడుతారు. శుక్రవారం ఎప్పుడొస్తుందా మంచి సినిమా చూద్దామా అని ఎదురు చేసే సినిమా బానిసలు ఎంతమంది ఉన్నారు. సినిమా రిలీజ్ అవ్వడానికంటే ముందు విడుదల చేసే కంటెంట్ అనేది సినిమా మీద ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంటుంది. అయితే ఆ క్యూరియాసిటీని దర్శక నిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారు.

 


దర్శక నిర్మాతలు మారరా?

 

చాలా సినిమాలకు సంబంధించి దర్శక నిర్మాతలు టీజర్ గురించి గానీ ట్రైలర్ గురించి గానీ రిలీజ్ చేయబోతున్నట్లు ముందుగా అప్డేట్ ఇస్తారు. తరువాత దానికి సంబంధించిన ప్రోమోన్ విడుదల చేస్తారు. ఆ తర్వాత ఈ టైం కి ట్రైలర్ వస్తుంది అని అనౌన్స్మెంట్ ఇస్తారు.

 

సినిమా మీద విపరీతమైన ఇష్టం ఉన్న చాలా మంది తెలుగు సినిమా బానిసలు, ఆ క్షణానికి తమకున్న పనులు కూడా పక్కన పెట్టేసి ట్విట్టర్ కొచ్చి ఎప్పుడు టైలర్ లేదా టీజర్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. చెప్పిన టైంకి అది రాదు. ఆ కొంత సేపటి తర్వాత కొన్ని సమస్యల వలన అనుకునే టైంకి రిలీజ్ చేయలేకపోయాము అని మరో టైం అనౌన్స్ చేస్తారు. ఉన్న పనులు మానుకుని వెయిట్ చేసిన వాళ్ళందరూ అసహనానికి గురవడం ఖాయం.

 

ఇలా ఆడుకోవడమేనా?

 

కేవలం ఇది ఒకటి రెండు సినిమాలకు జరుగుతుందా అంటే కాదు. చాలా సినిమాలకు ఇదే పరిస్థితి. అనుదీప్ కేవీ దర్శకత్వంలో విశ్వక్సేన్ నటించిన సినిమా ఫంకి. ఈ సినిమా టీజర్ నిన్న విడుదల చేశారు. ఈ టీజర్ ను విడుదల చేయడానికి ఒక టైం పెట్టారు. కానీ ఆ టైం కి టీజర్ రాలేదు.

 

కిరణ్ అబ్బవరం నటించిన K -Ramp సినిమా అక్టోబర్ 18న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మొదటగా ఈ ట్రైలర్ 4:5 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కానీ ఆ టైం కి రాలేదు. ఆ టైం కి మళ్లీ ఒక వీడియో పెట్టి ఐదు గంటల నాలుగు నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ కొద్ది కాలం పాటు చాలామంది అసహనానికి గురయ్యారు. మొత్తానికి ట్రైలర్ అయితే మాత్రం ఆకట్టుకుంది.

ఇలా ట్రైలర్ టీజర్ అనౌన్స్ చేసినప్పుడు పర్టిక్యులర్ గా అనుకున్న టైము డేటు మీద నిలబడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది పనులు మానుకుని మరి చెప్పిన టైం కోసం ఎదురు చూస్తారు కాబట్టి.

Also Read: Telusu Kada Trailer : ఇబ్బందుల్లో పడ్డ తెలుసు కదా చిత్ర యూనిట్, చివరి నిమిషంలో ఇలా

Related News

Actress Meena: గీతాంజలి సినిమా మీనా చేయాల్సిందా.. అలా మిస్ చేసుకుందా?

Nithiin: లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తో నితిన్ మూవీ… అంతా తమ్ముడు ఎఫెక్ట్

Chiranjeevi: నూతన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను కలిసిన చిరంజీవి !

Sai Dharam Tej : అల్లు అర్జున్ గురించి సాయి తేజ్ లేటెస్ట్ కామెంట్స్, ఆయన ఇప్పుడు గొప్పోళ్ళు అయిపోయారు

Mowgli Release Date: మొగ్లీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ , క్రేజీ వీడియో

Silambarasan TR: ఆ షార్ట్ ఫిలిం డైరెక్టర్ ని పట్టుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్, ఏకంగా శింబు తో సినిమా

‎Raviteja: ఆ డిజాస్టర్ సినిమాలంటే ఇష్టమన్న మాస్ హీరో..ఆ డౌట్ వస్తే సినిమా పోయినట్టేనా?

Big Stories

×