Roman Reigns vs Bronson reed: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ( World Wrestling Entertainment ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ మధ్యకాలంలో ఈ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ను జనాలు ఎక్కువగా ఆసక్తిగా చూస్తున్నారు. క్రికెట్ తర్వాత మన ఇండియాలో రెజ్లింగ్ ( Wrestling ) చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. రెజ్లింగ్ అని పిలుస్తున్న ఈ క్రీడాను మన ఇండియాలో కుస్తీ పోటీలు అంటారు. అయితే అలాంటి రెజ్లింగ్ లో రోమన్ రీన్స్ ( Roman Reigns ) చాలా పాపులర్ అన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి మల్లయోధుడు రోమన్ రీన్స్ తాజాగా చేసిన పని వైరల్ గా మారింది. రెజ్లింగ్ లో భాగంగా తన ప్రత్యర్థిని కొట్టేందుకు ఏకంగా క్రికెట్ బ్యాట్ పట్టుకున్నాడు. బ్యాగ్ లోంచి క్రికెట్ బ్యాట్ తీసి మరి, తన ప్రత్యర్థి WWE స్టార్ బ్రోన్సన్ రీడ్ ను ( Bronson reed ) దారుణంగా చితకబడాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రెజ్లర్లు ఇలాంటి ఆయుధాలను కూడా పడుతున్నారని కామెంట్ చేస్తున్నారు అభిమానులు.
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ( World Wrestling Entertainment ) లో ప్రస్తుతం కండల వీరుడు రోమన్ రీన్స్ ( Roman Reigns) వర్సెస్ బ్రోన్సన్ రీడ్ ( Bronson reed ) మధ్య ఫైట్ జరుగుతోంది. గత రెండు వారాలుగా ఇదే పరిస్థితి చోటుచేసుకుంది. అయితే డబ్ల్యు డబ్ల్యు ఈ క్రౌన్ జౌల్ 2025 లో ఆస్ట్రేలియన్ స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ రోమన్ రీన్స్ ( Roman Reigns) వర్సెస్ బ్రోన్సన్ రీడ్ ( Bronson reed ) మధ్య జరిగింది. ఈ నేపథ్యంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
ఈ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా తనతో పాటు ఓ బ్యాగ్ తెచ్చుకున్నాడు రోమన్ రీన్స్. అందులో రక్బీ బాల్ తో పాటు క్రికెట్ బ్యాట్ ను కూడా భద్రపరిచాడు. ఇక తన ప్రాణాలపైకి వచ్చిన నేపథ్యంలో మొదట రక్బీ బాల్ తో తన ప్రత్యర్థి బ్రోన్సన్ రీడ్ ( Bronson reed ) ను దారుణంగా కొట్టాడు. అనంతరం క్రికెట్ బ్యాట్ పట్టుకొని చితకబాదాడు రోమన్ రీన్స్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. క్రికెట్ బ్యాట్ తో తన ప్రత్యర్థిని చితకబాదిన మల్లాయోధుడు రోమన్ రీన్స్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మ్యాచ్ చివరలో ప్రతిఫలం అతనికి దక్కలేదు. మొదట అద్భుతంగా రాణించిన రోమన్ రీన్స్ చివరికి ఓడిపోవలసి వచ్చింది. చాక చక్యంతో రోమన్ రీన్స్ ప్రత్యర్థి బ్రోన్సన్ రీడ్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేశాడు.
Also Read: IND-W vs SA-W: రీల్స్ పైన ఉన్న ఫోకస్, బ్యాటింగ్ పైన లేదు…లేడీ కోహ్లీ అనుకుంటే, నట్టేట ముంచింది!
Roman reigns with a cricket bat. I have seen it all. The goat has done it all now pic.twitter.com/ddsUwNSlU9
— Knight (@elementary_talk) October 11, 2025