Big tv Kissik Talks: బుల్లితెర నటి విష్ణు ప్రియ(Vishnu Priya) తాజాగా కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈమె దాదాపు 15 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో సినిమాలలోను అలాగే సీరియల్స్ లోను నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక విష్ణు ప్రియ ప్రముఖ నటుడు సిద్ధార్థ వర్మ(Siddarth Varma)ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ దంపతులకు కుమారుడు కూడా ఉన్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా వర్ష ఈమె పెళ్లి గురించి ప్రశ్నలు వేయడంతో పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
అసలు మీది లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా ఎవరు ముందుగా ప్రపోజ్ చేశారు అంటూ ప్రశ్నించారు. ముందుగా మా పేరెంట్స్ మా పెళ్లికి ప్రపోజ్ చేసుకున్నారు అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. తాను పదో తరగతిలో ఉన్న సమయంలోనే ఒక తమిళ సినిమాలో అవకాశం వచ్చిందని ,తాను ఏ సినిమా షూటింగ్ కు వెళ్లినా తనతో పాటు అమ్మ కూడా ఉండేదని తెలిపారు. అయితే అమ్మకు క్యాన్సర్ రావడంతో ఇంటిపట్టునే ఉన్నారు. తనకు ట్రీట్మెంట్ చేయిస్తున్నాము అయితే ఈ విషయాన్ని నేను బయట ఎక్కడ చెప్పలేదు.. ఇక నేను ఒక సినిమా చేస్తున్న సమయంలోనే సిద్దు నాకు పరిచయమయ్యారని మా అన్నయ్య రాని సమయంలో సిద్దు నన్ను పికప్ చేసుకొని డ్రాప్ చేయడంతో మా అమ్మ గురించి తనకు తెలుసని తెలిపారు.
ఇక మా అమ్మకు క్యాన్సర్ రావడంతో పెళ్లి చేయాలని భావించారు. తన కూతురు పెళ్లి కల్లారా చూడాలని తన పిల్లల్ని ఎత్తుకోవాలనే కోరిక ఉండేది. నాకు పెళ్లి సంబంధం వస్తుంది అనే విషయం సిద్దూకి తెలియడంతో ఆయన నన్ను డ్రాప్ చేయడానికి వచ్చి.. నాకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం ఈరోజు నేను ఏమి సంపాదించకపోవచ్చు కానీ ఫ్యూచర్లో బాగా సంపాదించి తనకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను అంటూ ఆరోజు మాట ఇచ్చారు అదే మాటని ఈరోజు నిలబెట్టుకున్నారని తెలిపారు. అప్పటివరకు మా ఇద్దరి మధ్య ఎక్కడ పెళ్లి గురించి డిస్కషన్ రాలేదని ఒక్కసారిగా సిద్దు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మేమిద్దరం లవ్ లో ఉన్నామని మా అమ్మ భావించిందని విష్ణు ప్రియ తెలిపారు.
సిద్దు అలా ధైర్యంగా చెప్పడంతో మా నాన్నకు బాగా నచ్చేసాడని వెల్లడించారు. ఇక అమ్మకు సీరియస్ అయి చనిపోవడంతో చనిపోయిన ఏడాదిలోపే పెళ్లి చేయాలని మా పెళ్లి చేసేసారని, నా పెళ్లి చూడాలని మా అమ్మ కోరిక నెరవేరకుండానే మరణించారంటూ ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. ఇక నాన్న కూడా రెండు సంవత్సరాల క్రితమే చనిపోయారని విష్ణు ప్రియ తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ బాధపడ్డారు. అయితే సిద్దుతో నాకు దాదాపు 13 సంవత్సరాల పరిచయం ఉందని, మా పెళ్లి పెద్దలు కుదిర్చిన పెళ్లిగానే చేసుకున్నాము అంటూ తన ప్రేమ, పెళ్లి గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి
Also Read: Chiranjeevi: నూతన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను కలిసిన చిరంజీవి !