E-Paper
Advertisement

OTT Movie : 60 కోట్లతో తీస్తే 150 కోట్ల కలెక్షన్ల సునామీ… కళ్ళు చెదిరే విజువల్స్… తెలుగు మూవీనే

OTT Movie : 60 కోట్లతో తీస్తే 150 కోట్ల కలెక్షన్ల సునామీ… కళ్ళు చెదిరే విజువల్స్… తెలుగు మూవీనే
Advertisement

OTT Movie : తేజ సజ్జా ‘మిరాయ్’ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ‘హనుమాన్’ తరువాత ఆ రేంజ్ లో ఈ సినిమా ఆడియన్స్ ని అలరించింది. ఈ కథ అశోకుడు రాసిన 9 పవర్‌ఫుల్ గ్రంథాలను కాపాడే ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రశంసలు కూడా వస్తున్నాయి. థియేటర్లలో 150 కోట్ల కలెక్షన్లతో ఈ సినిమా అబ్బురపరచింది. నెల రోజులు తిరక్కుండానే ఓటీటీలో కూడా అదరగొడుతోంది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘మిరాయ్’ (Mirai) 2025లో వచ్చిన తెలుగు ఫాంటసీ అడ్వెంచర్ సినిమా. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్, జగపతి బాబు, జయరామ్, శ్రీయ సరన్, రితికా నాయక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది.
2025 అక్టోబర్ 10 నుంచి Jio Hotstarలోఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. IMDbలో 8.1/10 రేటింగ్ తో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

Advertisement

మిరాయ్ అనే అబ్బాయికి పుట్టుఉకతోనే ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది. అతను బ్రహ్మాండ శక్తితో కనెక్ట్ అయి ఉంటాడు. అయితే కథ అశోకుడు రాసిన 9 పవర్‌ఫుల్ గ్రంథాలు చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రంథాల వల్ల అమరత్వం పొందవచ్చు. అంతే కాకుండా వీటి వల్ల అంతులేని శక్తులు కూడా పొందుతారు. వీటిని పొందడానికి ఒక క్రూరమైన విలన్ తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు. ఈ సమయంలో మిరాయ్ ఈ గ్రంథాలను కాపాడాల్సి వస్తుంది. అతను తన పవర్ గురించి తెలుసుకుంటూ, ఆ గ్రంథాలను సేఫ్ గా ఉంచడానికి జర్నీ స్టార్ట్ చేస్తాడు.

Read Also : దొంగతనానికి వెళ్లి ట్రాప్ లో… ముసలాడా మజాకా… అదిరిపోయే మలయాళ కామెడీ థ్రిల్లర్

Advertisement

 

ఇక కథలో జగపతి బాబు, జయరామ్ అతనికి సహాయం చేస్తారు. విలన్ ఇందులో చాలా డేంజరస్. బ్లాక్ స్వార్డ్ అనే స్పెషల్ ఆయుధంతో ఆ గ్రంథాలను దొంగిలించాలని చూస్తాడు. అయితే మిరాయ్, విలన్‌ ల మధ్య భారీ ఫైట్ జరుగుతుంది. విలన్ చాలా బలంగా పోరాడతాడు. చివరికి ఆ గ్రంథాలను విలన్ చేజిక్కించుకుంటాడా ? హీరో అతని ప్రయత్నాన్ని ఆపుతాడా ? ఈ కథ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ ఫాంటసీ అడ్వెంచర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×