Sai Dharam Tej : మెగా హీరోల్లో సాయిధరమ్ తేజ్ ఒకరు. రేయ్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన పిల్ల నువ్వు లేని జీవితం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అయితే సాయి తేజ్ కెరియర్లో సక్సెస్ఫుల్ సినిమాలు కంటే ఫెయిల్యూర్ సినిమాలో ఎక్కువ ఉన్నాయి.
అప్పట్లో మెగా హీరోలు తమ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చేవాళ్ళు. ఒక తరుణంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ విషయంలో చెప్పను బ్రదర్ అని చెప్పినప్పుడు అల్లు అర్జున్ మీద తీవ్రమైన నెగిటివిటీ మొదలైంది. ఇక్కడి నుంచి మెగా అభిమానులు పెద్దగా అల్లు అర్జున్ ఫాలో అవ్వడం మానేశారు.
ఈ వివాదం అల్లు అర్జున్ దృష్టికి కూడా చేరింది. అందుకే ఒక మనసు ఆడియో లాంచ్ లో ఒక పది నిమిషాల పాటు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. అయితే అప్పుడు సాయి తేజ్ సైలెంట్ గా కూర్చుని విన్నారు. ఆ తర్వాత సాయి తేజ్ నటించిన తిక్క సినిమా విడుదలైంది. ఆ ఆడియో లాంచ్ లో అభిమానులతో సాయితేజ్ మాట్లాడుతూ అరవండి బ్రదర్ అన్నాడు.
అక్కడి నుంచి వీళ్ళిద్దరికీ మధ్య ఏదో జరిగింది అంటూ చాలా కథనాలు వినిపించాయి. ఈ విషయంలో సాయితేజ్ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు బన్నీ బన్నీ అని మాట్లాడే సాయి తేజ్ ఈసారి మాత్రం తన మాటల్లో అల్లు అర్జున్ ని ఆయన అని ప్రస్తావించడం మొదలుపెట్టారు.
సాయి తేజ్ రీసెంట్ గా ఒక కార్యక్రమానికి హాజరైతే, అభిమానులు అల్లు అర్జున్ గురించి మాట్లాడండి అని అరిచారు. దీనికి సాయి తేజ స్పందిస్తూ అల్లు అర్జున్ గురించి ఏం మాట్లాడుతామండి.? ఆయన సూపర్ గా యాక్ట్ చేస్తారు.
ఆయన బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ ఇండియా అయిపోయారు. ఆయన చాలా గొప్పోళ్ళు అయిపోయారు. నేను చేస్తున్న వర్క్ గురించి, ఆయన గురించి నేను వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటూ సాయి తేజ్ అన్నాడు. సాయి తేజ్ స్పీచ్ చూస్తుంటే ఏ వాయిస్ మాడ్యులేషన్లో అన్నాడో అది మనకు ఈజీగా అర్థమవుతుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ కెరీర్ లో ఇది 22వ సినిమా. అట్లీకు ఇది 6వ సినిమా. ఇప్పటివరకు అట్లీకి ఒక డిజాస్టర్ సినిమా కూడా లేదు. ఈ సినిమా సక్సెస్ అయితే డబుల్ హ్యాట్రిక్ అట్లీ కొట్టినట్టే.
Also Read: Mowgli Release Date: మొగ్లీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ , క్రేజీ వీడియో