Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 లో 34 వ రోజు వచ్చేసింది. ఎపిసోడ్ మొదలవగానే తనుజ తనకి ఎవరూ సపోర్ట్ చేయలేదు అని నిన్నటి ఎపిసోడ్లో అన్నదాని గురించి కాసేపు భరణి మరియు ఇమ్మానియేల్ మధ్య టాపిక్ నడిచింది. నేడు వీకెండ్ సందర్భంగా నాగర్జున వస్తారు కాబట్టి మాస్ గెటప్ లో ఎంట్రీ ఇచ్చారు.
హౌస్ మేట్స్ కి గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాళ్ళు ఒక టాస్క్ పెట్టారు. ఎవరు ఎక్కువ పూరీలు చేస్తే ఆ టీం కి ఆరు నెలలపాటు ఆయిల్ ఫ్రీ అనే ఆఫర్. టీం ఏ మరియు టీం బి కి మధ్య ఈ పోటీ జరిగింది. దీనిలో టీం ఏ గెలిచారు.
నాగార్జున వచ్చిన వెంటనే హౌస్ మేట్స్ ను పలకరించారు. తనుజను కన్ఫెషన్ రూమ్ కి రమ్మని చెప్పారు. కెప్టెన్సీ టాస్క్ కు సంబంధించిన ఒక వీడియోను తనుజకు బిగ్ బాస్ చూపించారు. ఆ టాస్క్ లో ఎవరు ఎలా గేమ్ ఆడారు అని బిగ్ బాస్ చెప్పాడు. మొత్తానికి భరణి మీద నెగిటివ్ ఇంప్రెషన్ తనుజ కి క్రియేట్ చేశారు.
తనుజ కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇమ్మానుయేల్ డైరెక్ట్ గా కొట్టకపోయినా ఇన్ డైరెక్ట్ గా వర్డ్స్ తో హట్ చేస్తాడు అంటూ నాగార్జునకు కంప్లైంట్ చేసింది. ఇమ్మానియేల్ కూడా హౌస్ లో తనకి ఎవరూ సపోర్ట్ లేరు మా నాన్న ఒక్కరే ఉన్నారు అని అనడం నాకు బాధేసింది సార్ అని చెప్పాడు.
హౌస్ మేట్స్ ముందు టాస్క్ గురించి నాగార్జున తనుజను అడిగారు. అలానే తనుజ కి భరణి క్లోజ్ అవుతున్నారని ఏమైనా ఫీల్ అవుతున్నావా అని అడిగారు. ఒకప్పుడు ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు ఫీల్ అవ్వట్లేదు అంటే చెప్పేసింది. ఈ తరుణంలో భరణి మధ్యలో మాట్లాడే ప్రయత్నం చేశాడు. వెంటనే నాగార్జున మాట్లాడుతూ.. భరణి నీకు కూడా శ్రీజ లా మధ్యలో మాట్లాడే అలవాటు వచ్చేసింది అంటూ చెప్పారు.
బెడ్ టాస్క్ గురించి భరణి, ఫ్లోరాకు చిన్నపాటి క్లాస్ పీకారు. సంచాలక్ గా ఫ్లోరా ఫెయిల్ అయ్యావు అని నాగార్జున చెప్పారు. అలానే ధర్మరాజు ఎన్ని తప్పులు చేశాడో నువ్వు హౌస్ లో అన్ని తప్పులే చేస్తున్నావ్ అంటూ భరణికి చెప్పారు నాగార్జున. ఒకటి చెప్తున్నాను భరణి వారంలో తప్పులు చేసి వీకెండ్ లో ఒప్పుకుంటే జరగదు అని చెప్పేశారు. ఎక్కడ తప్పుని అక్కడే ఒప్పుకోవాలి. అలానే యూకే నుంచి ఒక ఆడియన్ బంధాలు పక్కన పెట్టి గేమ్ ఆడు అంటూ భరణికి చెప్పింది.
రాము రాథోడ్ కెప్టెన్ గా ఇరగ్గొట్టేసావు, సంచాలక్ గా మంచి నిర్ణయాలు తీసుకున్నావ్. అందరితో అన్ని పనులు చేయించావు. ఇప్పటివరకు ఈ హౌస్ లో నా వరకు నువ్వే బెస్ట్ కెప్టెన్. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు, ఎక్కడ వరకు వచ్చావు మర్చిపోకు అంటూ చెప్పారు నాగార్జున.
ఇమ్మానుయేల్ ను బెలూన్ టాస్క్ కు సంచలక్ గా పెట్టిన సంగతి తెలిసిందే. ఆ టాస్కు ఎవరూ కూడా సరిగ్గా ఆడలేదు. సంజన వాళ్లు ఆడారు కానీ దానిని రద్దు చేశారు. అక్కడ నువ్వు ఫెయిల్ అయ్యావు అని ఇమ్మానుయేల్ కి నాగార్జున చెప్పారు. నీవలన ఆట క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది ఇకనుంచి చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసారు.
మొత్తానికి హౌస్ లో 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో ఆరుగురికి గోల్డెన్ స్టార్స్ వచ్చాయి. గోల్డెన్ స్టార్స్ వచ్చినవాళ్లంతా సేఫ్ జోన్ లో ఉన్నారు. ఆరుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు. సంజన, ఫ్లోరా కు బ్లాక్ స్టార్స్ ఇచ్చారు. ఇద్దరు ఎమోషనల్ గా డౌన్ అయిపోతున్నారు అంటూ నాగర్జున చెప్పారు. రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి ఉదాహరణలు చెప్పి ఎమోషనల్ గా డౌన్ కావద్దని వాళ్లకు చెప్పారు నాగ్.
శ్రీజ నువ్వు గేమ్స్ బాగా ఆడుతున్నావు. చాలామంది నిన్ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకుంటున్నారు. కానీ ఎక్కడ నీ వాయిస్ వినిపించాలో అక్కడ వినిపించట్లేదు. లేనిపోనిచోట్ల అరుస్తున్నావ్. అందరూ గేమ్ ఆడుతున్నారు నీ గేమ్ కూడా నువ్వు ఆడు. రీతు నిన్ను టార్గెట్ చేస్తున్నట్టు ఏమైనా ఫీలింగ్ వచ్చిందా అని అడిగారు. అవును సార్ వచ్చింది చాలాసార్లు అని శ్రీజ చెప్పింది.
బెలూన్ టాస్క్ లో మీరు ఎంత తెలివిగా ఆడారో తెలుసా. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా అలానే ఆడడం మొదలుపెట్టారు. నాగార్జున చెప్పగానే కపిపుచ్చే ప్రయత్నం చేసింది రీతు.
గోల్డెన్ స్టార్ ఉన్న వాళ్ళ స్కోర్లు రెట్టింపు చేసుకునే విధంగా పవరాస్త్ర అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు బిగ్ బాస్. యాక్టివిటీ రూంలో కొన్ని కీస్ ఉన్నాయి. ఆ కీస్ లో పవర్ వస్త్ర ఎవరికి దక్కకూడదు కింద వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి. పవరస్త్ర ఎవరికి దక్కకూడదు అని మిగతా వాళ్ళు అనుకుంటారు వాళ్లు అక్కకి విరిచే వచ్చు.
తనుజ యాక్టివిటీ రూమ్ కి వచ్చి రాము రాథోడ్ కి పవరాసర దక్కకూడదు అని కి విరిచింది. కారణం చెబుతూ… ఎటువంటి సిచువేషన్ వచ్చినా కూడా రాము స్టాండ్ తీసుకోడు అని రాముకి రావలసిన పవర్ కీను విరిచేసింది తనుజ. తనకంటూ ఓన్ థాట్ లేదు అని కంప్లైంట్ చేసింది.
దివ్య ఆక్టివిటీ రూమ్ లోకి వెళ్లి కళ్యాణ్ కీ ను విరిచింది. ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాడు కానీ బ్రెయిన్ పెట్టి ఎక్కువగా ఆలోచించడు అనే కారణం చెప్పింది. తనుజ కీ ను భరణి విరిచేశారు. తనుజ ఎమోషనల్ అని చెప్పారు. ఇమ్మానుయేల్ దివ్య కి విరిచారు. కళ్యాణ్ భరణి కీ విరిచారు. మొత్తానికి ఇమ్మానియేల్ కి పవర్ ఆస్త్ర దక్కింది.
బ్లాక్ స్టార్స్ ఉన్న ఆరుగురు గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. వారిలో ఫ్లోరా, రీతు ఎవిక్షన్ కి దగ్గర్లో ఉన్నారు. శ్రీజ, సంజన, సుమన్ శెట్టి, ఇంకా డేంజర్ జోన్ ఉన్నారు.
టాస్క్ కోసం ఇంటి సభ్యులు రెండు గ్రూప్స్ గా విడిపోయారు. ఈ టాస్క్ లో భాగంగా సభ్యులు తమకు కేటాయించిన స్టిక్స్ ఉపయోగించి, పక్కనే పైన ఉన్న బెలూన్స్ ని పాప్ చేయాలి. దాంట్లో సాఫ్ట్ టచ్ ససాస్ ఉంటాయి. వాటిని సేకరించాలి. దీనిలో టీం గా ఆడిన రాము రాథోడ్, తనూజ, భరణి, దివ్య, శ్రీజ గెలిచారు. ఫ్లోరా, రీతు ఎలిమినేషన్ అయిపోవడానికి దగ్గర్లో ఉన్నారని అనిపిస్తుంది.
Also Read: Nithiin: లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తో నితిన్ మూవీ… అంతా తమ్ముడు ఎఫెక్ట్