Bigg Boss 9: బిగ్ బాస్ లో కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతాయి. కానీ అవి పెద్దగా బయటకు రావు. ఒక సీజన్లో సోహెల్ టైటిల్ గెలిచే కాంపిటీషన్లో ఉన్నప్పుడు కూడా బయట నుండి మెహబూబ్ ఏదో సైగలు చేశాడు అని అప్పట్లో వీడియో వైరల్ అయ్యాయి. 40 లక్షలు క్యాష్ ప్రైస్ వస్తది రన్నర్ గా ఉండిపో అన్నట్లు అతను చెప్పాడు అని అప్పట్లో బీభత్సంగా వైరల్ చేశారు.
బిగ్బాస్ సీజన్ 9 వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున తనుజను కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. కన్ఫెషన్ రూమ్ లో తనుజ తో మాట్లాడుతూ.. తనను జన్యూన్ గా ఎవరు సపోర్ట్ చేశారో లేదో అని ఒక వీడియో చూపించారు. అయితే ఆ వీడియోలో కళ్యాణ్ తన కళ్ళతో తనుజాకి ఏదో కన్వె చేస్తున్నట్లు ఉంది. కన్వే చేసే విషయాన్ని పక్కన పెడితే ఎవరు ఒకరినొకరు చూసుకోకూడదు అని అక్కడ రూల్ పెట్టారు. దీనిని బట్టి రూల్ ను అతిక్రమించినట్లు చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఆ టాస్క్ ఏంటి అంటే.?
5వ వారం కెప్టెన్ అవ్వడానికి బిగ్ బాస్ కనుక్కోండి చూద్దాం అనే కొత్త టాస్క్ ఇచ్చారు. సంజన సంచాలకులుగా వ్యవహరించారు. గార్డెన్ ఏరియాలో కొన్ని చైర్లు ఏర్పాటు చేశారు. పోటీదారులు కళ్ళకు గంతలు కట్టుకొని ఆ కేర్ మీద కూర్చోవాలి. బజార్ మోగినప్పుడు సంచాలకులు ఒక వ్యక్తిని ఎంచుకొని వాళ్ళ భుజం పైన తట్టాలి.
అప్పుడు ఆ పోటీదారులు తమ కళ్ళకు ఉన్న గంతలు తీసి, చైర్ మీద కూర్చున్న మిగిలిన సభ్యులలో ఒకరిని ఎన్నుకొని వాళ్ల ముందున్న లైట్ ఆఫ్ చేసి మళ్లీ కళ్లకు గంతలు కట్టుకొని వాళ్ల చైర్ లో వాళ్ళు కూర్చుని పోవాలి. ఎవరి లైట్ అయితే ఆఫ్ అయిందో వాళ్లు లేచి వాళ్ళ లైట్ ను ఎవరు ఆఫ్ చేశారు కనుక్కోవాలి.
ఆ గెస్ కరెక్టే అయితే లైట్ ఆఫ్ చేసిన వ్యక్తి ఎలిమినేట్ అవుతారు. గెస్ రాంగ్ అయితే ఎవరి లైట్ ఆఫ్ అయిందో వాళ్లు ఎలిమినేట్ అయిపోతారు. ఇద్దరు సభ్యులు మిగిలిన అంతవరకు ఇది కంటిన్యూ అవుతుంది.
ఈ టాస్క్ లో తనుజ మరియు కళ్యాణ్ కెప్టెన్సీ పోటీ కోసం మిగిలారు. వీరిలో ఒకరిని కెప్టెన్ గా డిసైడ్ చేసే అవకాశం బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఇచ్చారు. వెంటనే అందరూ కలిసి కళ్యాణ్ ను కెప్టెన్ గా ఎంచుకున్నారు.
ఇలా కెప్టెన్ గా కళ్యాణ్ ను అందరూ ఎంచుకున్నందుకు తనుజ కూడా అందరి పైన ఆగ్రహం 33వ రోజు ఎపిసోడ్ లో వ్యక్తపరిచింది. భరణి తప్ప హౌస్ లో తనకు సపోర్ట్ లేదంటూ గోల పెట్టేసింది. ఏదేమైనా వీళ్ళిద్దరూ ఫైర్ గేమ్ ఆడలేదు అనేది చాలామంది అభిప్రాయం.
Also Read : Bigg Boss 9 : భరణి తనూజ బాండింగ్ కు బ్రేక్ పడినట్లేనా? సంచాలక్ గా ఇమ్ము ఫెయిల్? దుమ్ము లేపిన మాస్