Sa vs Nam: టీ20 క్రికెట్ లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికాపై నమీబియా క్రికెట్ టీం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అది కూడా టి20ల్లో నమీబియా సంచలన విజయం నమోదు చేసుకోవడం గమనార్హం. సఫారీ లతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో నమీబియా నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 134 పరుగులు చేస్తే..ఆ లక్ష్యాన్ని నమీబియా అవలీలగా ఛేదించింది. దీంతో దక్షిణాఫ్రికా పై నాలుగు వికెట్ల తేడాతో నబీబియా విక్టరీ సాధించింది.
Also Read: IND-W vs SA-W: రీల్స్ పైన ఉన్న ఫోకస్, బ్యాటింగ్ పైన లేదు…లేడీ కోహ్లీ అనుకుంటే, నట్టేట ముంచింది!
సౌత్ ఆఫ్రికా వర్సెస్ నమీబియా మధ్య ఒకే ఒక్క టి20 ఇవాళ జరిగిన సంగతి తెలిసిందే. విండ్‌హోక్ వాండరర్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరిగింది. భారత కాలం మాన ప్రకారం, సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో మొదట సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసింది. దీంతో నిర్ణీత 20 ఓవర్స్ లో 8 వికెట్ల నష్టపోయిన సౌతాఫ్రికా 134 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ జట్టుకు డోనోవన్ ఫెర్రీరా ( Donovan Ferreira ) కెప్టెన్ గా వ్యవహరించారు. డికాక్ వికెట్ కీపర్ గా ఉన్నారు. ఇక మిగతా ప్లేయర్లు అందరూ కొత్త వాళ్లే. ఈ ప్లేయర్లు అందరూ కొత్త వాళ్లు కావడంతో, నమీబియా లాంటి ప్లేయర్లు దారుణంగా ఓడించారు. ఇక సౌతాఫ్రికా ఫిక్స్ చేసిన లక్ష్యాన్ని 6 వికెట్లు నష్టపోయి చేధించింది నమీబియా జట్టు. దీంతో 4 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి, చరిత్ర సృష్టించింది నమీబియా.
సౌతాఫ్రికా లాంటి బలమైన జట్టుపై విజయం సాధించడం చాలా కష్టం. అలాంటిది పసికోన నమీబియా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మాట వినగానే అందరికీ గూస్ బంప్స్ వస్తాయి. చాలా మంది షాక్ అవుతూ ఉంటారు. అలాంటిది విన్నింగ్ షాట్ ఆడిన తర్వాత నమీబియా ప్లేయర్ల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మ్యాచ్ గెలిచిన అనంతరం గ్రౌండ్ లో ఉన్న అభిమానులతో పాటు, నమీబియా ప్లేయర్లు కూడా సంబరాలను అంబరాన్ని అంటే ఎలా చేసుకున్నారు. వరల్డ్ కప్ గెలిచినంత సెలబ్రేషన్స్ చేసుకున్నారు నమీబియా ప్లేయర్లు. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించిన నమీబియా జట్టుపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. దక్షిణాఫ్రికా లాంటి జట్టును ఓడించడం అరుదైన విషయం అంటూ పొగుడుతున్నారు. ఇలాగే నమీబియా ముందుకు సాగితే, ఐసీసీ టోర్నమెంట్లలో కూడా మంచి విజయాలను అందుకుంటుందని అంటున్నారు.
THE HISTORIC MOMENT…!!! 😍
– Namibia Defeated South Africa in the T20I, Winning celebration was emotional. pic.twitter.com/uboCiwnOdE
— Johns. (@CricCrazyJohns) October 11, 2025
Namibia 🇳🇦 creates history.
Namibia beat south africa in one and only t20 on their home ground.
Historic Day for Namibia cricket! pic.twitter.com/kZXpm0ry5k
— CricketGully (@thecricketgully) October 11, 2025