Chiranjeevi: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సరదాగా హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (VCSajjanar)తో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీసీ సజ్జనార్ తాజాగా పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో చిరంజీవి నేడు సాయంత్రం మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి బొకే అందజేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కాసేపు వీసీ సజ్జనార్ తో మాట్లాడుతూ శాంతి భద్రతలు, అలాగే హైదరాబాద్ ఉన్న సమస్యల గురించి కూడా ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది.
గతంలో పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న ఈయన ఒక ఎన్కౌంటర్ విషయంలో పోలీస్ కమిషనర్ బాధ్యతల నుంచి తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలను తీసుకున్నారు. అయితే ఆర్టీసీ ఎండీగా ఈయన ఎంతో అద్భుతమైన సేవలను అందించారు. ఇక ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ సేవలు పూర్తి కావడంతో ఇప్పుడు మళ్లీ పోలీస్ యూనిఫామ్ లోకి వచ్చారు. పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఈయన ఎన్నో కీలక ఆదేశాలను జారీ చేయడమే కాకుండా, యాక్సిడెంట్లను నిర్మూలించడం కోసం అలాగే మాదకద్రవ్యాల నిర్మూలన గురించి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇలా పోలీస్ కమిషనర్ గా ప్రస్తుతం బిజీగా గడుపుతున్న
వీసీ సజ్జనార్ ను చిరంజీవి తన కుమార్తె సుస్మిత (Susmitha)మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇక చిరంజీవి వీసీ సజ్జనార్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రస్తుతం సినిమాల పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.. ఈయన నటించిన విశ్వంభర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతోపాటు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాకి కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
హైప్ పెంచిన మీసాల పిల్ల సాంగ్..
ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలన్న ఉద్దేశంతో షూటింగ్ పనులను కూడా వేగవంతం చేశారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా మరోసారి నయనతార నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్, షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలనే పెంచేసాయి. ఇక ఇటీవల విడుదలైన మీసాల పిల్ల అనే పాట కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది.. ఇక ఈ పాటకు సంబంధించిన పూర్తి వీడియో అక్టోబర్ 13వ తేదీ విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం వెల్లడించారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమాతో పాటు డైరెక్టర్ బాబి తో కూడా మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.
Also Read: Big tv Kissik Talks: ఆ సీరియల్ ఎఫెక్ట్..ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన విష్ణు ప్రియ ..అలా అవమానించారా!