BigTV English

Silambarasan TR: ఆ షార్ట్ ఫిలిం డైరెక్టర్ ని పట్టుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్, ఏకంగా శింబు తో సినిమా

Silambarasan TR: ఆ షార్ట్ ఫిలిం డైరెక్టర్ ని పట్టుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్, ఏకంగా శింబు తో సినిమా

Silambarasan TR: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ రోజుల్లో రాణించాలి అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. చేతిలో టాలెంట్ ఉంటే సరిపోతుంది. యూట్యూబ్ సోషల్ మీడియాని నమ్ముకుని చాలామంది ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు. ఒకప్పుడు దర్శకుడుగా సినిమా చేయడమంటే కష్టమైన విషయం. కొంతమంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత అసోసియేట్ గా ఎదిగి, తర్వాత కో డైరెక్షన్ చేస్తూ ఇంకా కో-డైరెక్టర్ గా మిగిలిపోయిన వాళ్ళు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు.


కానీ కొంతమంది మాత్రం ఒక సినిమాకి పనిచేసి ఫిలిం కోర్స్ చదువుకొని సినిమాలు చేసిన దర్శకులు కూడా ఉన్నారు. ఇంకొంతమంది మాత్రం కేవలం షార్ట్ ఫిలిమ్స్ చేసి సినిమా చేయగలము అని కాన్ఫిడెంట్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ వలన వచ్చిన చాలామంది దర్శకులు ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా కార్తీక్ సుబ్బరాజ్, లోకేష్ కనకరాజు వంటి దర్శకులు షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినవాళ్లే.

మరో షార్ట్ ఫిలిం దర్శకుడు 

మనసానమః అనే షార్ట్ ఫిలిం తో మంచి గుర్తింపు సాధించుకున్నాడు దీపక్. ఈ షార్ట్ ఫిలిం అప్పట్లో బాగా పాపులర్ అయింది. ఈ షార్ట్ ఫిలిం తర్వాత దీపక్ సినిమా చేస్తాడు అని చాలామంది ఊహించరు. మొత్తానికి ఆ కల ఇప్పుడు నెరవేరుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో దీపక్ దర్శకుడుగా సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలేవి వర్కౌట్ కావడం లేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన కింగ్డమ్ ఊహించిన రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయింది. అలానే ఎన్టీఆర్ నటించిన వార్ సినిమా తెలుగు రైట్స్ తీసుకున్నాడు నాగ వంశీ. ఆ సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.

తమిళ్ స్టార్ హీరో 

కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా మంచి గుర్తింపు సాధించుకున్నాడు శింబు. తను చేసిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. వల్లభ, మన్మధ వంటి సినిమాలు ఇప్పటికీ కూడా మంచి హై ఫీల్ క్రియేట్ చేస్తాయి.

మొత్తానికి దీపక్ దర్శకత్వంలో శింబు సినిమా చేయనున్నట్లు విశ్వసినీ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. దీని గురించి అధికారక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఇదివరకే తెలుగులో ధనుష్ లాంటి హీరోకి కూడా బ్రహ్మరథం పట్టారు ఆడియన్స్. మరి ఎప్పటినుంచో పరిచయం ఉన్న శింబు సినిమాని ఎలా ఆదరిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

Also Read: Telusu Kada Trailer : ఇబ్బందుల్లో పడ్డ తెలుసు కదా చిత్ర యూనిట్, చివరి నిమిషంలో ఇలా

Related News

Actress Meena: గీతాంజలి సినిమా మీనా చేయాల్సిందా.. అలా మిస్ చేసుకుందా?

Nithiin: లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తో నితిన్ మూవీ… అంతా తమ్ముడు ఎఫెక్ట్

Chiranjeevi: నూతన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను కలిసిన చిరంజీవి !

Sai Dharam Tej : అల్లు అర్జున్ గురించి సాయి తేజ్ లేటెస్ట్ కామెంట్స్, ఆయన ఇప్పుడు గొప్పోళ్ళు అయిపోయారు

Mowgli Release Date: మొగ్లీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ , క్రేజీ వీడియో

K- Ramp Trailer delay : ఈ దర్శక నిర్మాతలు మారరా, ప్రేక్షకులతో ఆడుకోవడమే పని అయిపోయిందా

‎Raviteja: ఆ డిజాస్టర్ సినిమాలంటే ఇష్టమన్న మాస్ హీరో..ఆ డౌట్ వస్తే సినిమా పోయినట్టేనా?

Big Stories

×