Meenakshi Chowdary: మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) సౌత్ సినీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా మారుమోగుతున్న పేరు. ప్రస్తుతం ఈమె ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. మీనాక్షి చౌదరి “ఇచ్చట వాహనములు నిలపరాదు” అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమయ్యారు. 2021 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకో లేకపోయినా మీనాక్షి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ సినిమా తర్వాత ఈమె తదుపరి వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
పేరులో చిన్న మార్పులు..
గుంటూరు కారం సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీనాక్షి చౌదరి అనంతరం లక్కీ భాస్కర్, విజయ్ గోట్, వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vadtunnam) వంటి వరుస హిట్ సినిమాలతో ఈమె పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో మీనాక్షి చౌదరి కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి సక్సెస్ అందుకున్న ఈమె మరింత సక్సెస్ కోసం ఏకంగా తన పేరును మార్చుకోవటం (Name Change) ప్రస్తుతం చర్చలకు కారణమైంది. తాజాగా ఈమె తన పేరులో చిన్న మార్పులు చేసుకున్నారని తెలుస్తోంది.
జాతకాలు నమ్ముతారా?
సాధారణంగా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు మంచి సక్సెస్ అవ్వడం కోసం పెద్ద ఎత్తున పూజలు చేయించడం, అలాగే వారి జాతకాల ఆధారంగా పేర్లలో మార్పులు చేసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది హీరో, హీరోయిన్లు పేర్లు కూడా మార్చుకున్నారు. తాజాగా మీనాక్షి చౌదరి కూడా ఆస్ట్రాలజీ అలాగే న్యూమరాలజీ ప్రకారం తనకు మరింత సక్సెస్ రావాలని తన పేరులో చిన్న అక్షరాన్ని జోడించారు. ఇంగ్లీషులో మీనాక్షి చౌదరి పేరు రాస్తే ఎన్ పక్కన మరొక లెటర్ ఏ జోడిస్తూ Meenaakshi Chowdary గా తన పేరును మార్చుకున్నారు.
పాన్ ఇండియా సక్సెస్ వస్తుందా?
ఇలా మార్చుకోవడం వల్ల తనకు ఎంతో ఎనర్జీ అలాగే, తన పనిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడం, ఇండస్ట్రీలో మరింత సక్సెస్ వస్తుందని భావించారట. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు షాక్ అవుతున్నారు మీనాక్షి చౌదరి కూడా ఇలాంటి వాటిని నమ్ముతారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి పేరు మార్చుకున్న ఈమె ఇండస్ట్రీలో మరింత సక్సెస్ అందుకుంటుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇదివరకు ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు సక్సెస్ కోసం ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చేత కూడా పూజలు చేయించిన విషయం మనకు తెలిసిందే. అలాంటి వారిలో రష్మిక కూడా ఒకరు. ప్రస్తుతం ఈమె కెరియర్ పరంగా పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నారు. మరి రష్మిక లాగే మీనాక్షి చౌదరి కూడా పేరులో మార్పులు చేసిన తర్వాత పాన్ ఇండియా సక్సెస్అందుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
Also Read: స్క్విడ్ గేమ్ 3లో దాగుడు మూతలట.. 3 నిమిషాల సీన్ రిలీజ్, ఈ సారి కొత్త ట్విస్ట్!