BigTV English

Actress Ramya: నటి రమ్యకు అత్యాచార బెదిరింపులు… పోలీసుల అదుపులో ఆ హీరో ఫ్యాన్స్!

Actress Ramya: నటి రమ్యకు అత్యాచార బెదిరింపులు… పోలీసుల అదుపులో ఆ హీరో ఫ్యాన్స్!

Actress Ramya: కన్నడ సినీనటి రమ్యకు (Ramya) సోషల్ మీడియా వేదికగా గత కొంతకాలంగా అత్యాచార బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియాలో ఈమెను టార్గెట్ చేస్తూ తనని అత్యాచారం చేస్తామని బెదిరింపులకు పాల్పడుతూ చేస్తున్నటువంటి పోస్టులపై నటి రమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన గురించి వస్తున్నటువంటి ఈ అభ్యంతరకర పోస్టులను ఆమె క్రోడీకరించి ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే విషయాలను కనుగొన్నామని, వారిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇక ఈమె హెచ్చరించిన విధంగానే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరు ఆకతాయిలను అరెస్టు చేశారు.


బెదిరింపులకు పాల్పడిన దర్శన్ ఫాన్స్…

నటి రమ్య పట్ల ఇలాంటి బెదిరింపులకు పాల్పడినది మరెవరో కాదు ప్రముఖ నటుడు దర్శన్ అభిమానులు(Darshan Fans) అని తెలుస్తోంది. గత కొద్ది నెలల క్రితం దర్శన్ రేణుక స్వామి(Renuka Swamy) హత్య కేసులో భాగంగా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం గురించి ఈమె గతంలో మాట్లాడుతూ.. దర్శన్ ఎంతో మంచి సినీ భవిష్యత్తును కలిగి ఉన్నారు కానీ ఆయన ఈ తప్పు చేయకుండా ఉండాల్సింది అంటూ దర్శన్ చేసిన హత్య గురించి మాట్లాడటంతో అప్పటినుంచి దర్శన్ అభిమానులు ఈమెను టార్గెట్ చేశారని తెలుస్తోంది.


నిన్ను హత్య చేసి ఉండాల్సింది..

దర్శన్ గురించి రమ్య మాట్లాడటంతో దర్శన్ రేణుక స్వామిని కాకుండా నిన్ను హత్య చేసి ఉండాల్సింది. నిన్ను కూడా రే** చేసి చంపుతాం అంటూ అనుచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడ్డారు. కొంత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలోనే ఈమె ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే పోలీసులు ఎవరైతే సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు చేశారో వారి గురించి దర్యాప్తు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ దర్యాప్తులో భాగంగా మరి కొంత మందిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతుంది.

రాజకీయాలలోకి నటి రమ్య..

ఇక నటి రమ్యకు ఈ విధమైనటువంటి బెదిరింపులు రావడంతో ఎంతోమంది కన్నడ సినీ తారలు ఈమెకు పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేశారు. ఈ విషయంలో నటి రమ్య నిర్ణయం సరైనదే అంటూ పలువురు స్టార్ హీరోలు హీరోయిన్స్ ఈమెకు పూర్తిగా మద్దతుగా నిలిచారు. ఇక రమ్య సినీ కెరియర్ విషయానికి వస్తే.. అభిమన్యు అనే సినిమా ద్వారా ఈమె తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈమె అనేక కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి మెప్పించారు. నిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం ఈమె రాజకీయాలలో (Politics) కొనసాగుతున్న నేపథ్యంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి.

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×