BigTV English
Advertisement

Kavitha Deeksha: నీళ్లు కూడా తాగను.. 72 గంటలు కవిత నిరాహార దీక్ష..

Kavitha Deeksha: నీళ్లు కూడా తాగను.. 72 గంటలు కవిత నిరాహార దీక్ష..

Kavitha Deeksha: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తు జాగృతి అధ్యక్షురాలు కవిత 72 గంటల నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇది రాజకీయ పోరాటం కాదని.. బీసీల ఆత్మగౌరవ పోరటమని కవిత అన్నారు. రాజ్యాధికారంలో బీసీల పాత్రపెరగాలన్నారు. బీసీ బిల్లు బీజేపీ పై నెట్టేసి కాంగ్రెస్ చేతులు దులుపుకోవాలని చూస్తోదన్నారామె. బీసీలకు 42శాతం, ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ సపరేట్‌గా కల్పించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీసీలను మోసం చేస్తోందని ఆరోపించారు. 72గంటల నిరాహార దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.


ఇది రాజకీయ పోరాటం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం -కవిత

అయితే ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. “42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తిరాల్సిందే అని ఇవ్వాల నిరహార దీక్ష చేస్తున్నాం అని చెప్పింది. 42 శాతం రిజర్వేషన్ల కోసం 72 గంటల నిరంతర నిరహార దీక్ష చేస్తూ ఇవ్వాల ఇక్కడ కూర్చున్నాం అని తెలిపారు. అంతేకాకుండా ఇది రాజకీయ పోరాటం కాదు.. బీసీల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం అని చెప్పింది. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ రాజ్యాధికారంలో వాటా కావాలి, ఆర్థిక అవకాశాలు రావాలి.. సమాజంలో సగ భాగం బీసీలు ఉన్నారు. వాళ్లకు రాజకీయంగా సమ ప్రాధాన్యం దక్కాలనే సంకల్పంతో ఈ దీక్ష చేపట్టాం. అంతేకాకుండా కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పినట్లు బీసీలకు న్యాయం చేయాలని గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడుతున్నాం అని అన్నారు. అలాగే అందరి ఆకాంక్ష ఒకటే.. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి.. కానీ రాష్ట్ర ప్రభుత్వం భాజపా మీద నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తోంది.”


బీసీలకు 42శాతం,ముస్లింలకు 10శాతం రిజర్వేషన్ కల్పించాలి -కవిత

కాంగ్రెస్ ప్రెస్‌మీట్ పెట్టి ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ సపరేట్‌గా బిల్లు పెడతాం అని డిక్లరేషన్ చేయండి.. ఒక క్లారిటి ఇవ్వండని చెప్పింది. దీనివల్ల ప్రస్తుతం ఉన్న 42 శాతంలో ముస్లిం, మైనరిటీల రిజర్వేషన్ దీంట్లో ఇన్‌క్లూడెడ్ కాదు.. ముస్లింలకు సపరేట్‌గా 10 శాతం రిజర్వేషన్ పెట్టాలని కవిత డిమాండ్ చేసింది. ఈ 42 శాతంలో ముస్లింలు లేరనే విషయాన్ని కాంగ్రెస్ క్లారిటి ఇవ్వాలి. దీనికి రేవంత్‌రెడ్డి హామి ఇవ్వాలని కోరింది. దీంతో భాజపా ఎందుకు ఒప్పుకోదో మేమూ చూస్తాం.. అని అన్నారు.

Also Read: పిఠాపురం కూటమిలో ఉప్పాడ రచ్చ

కవిత దిక్షపై మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్..

బీసీ రిజర్వేషన్లకు నిర్ణయం తీసుకోవాల్సింది ఢిల్లీలో అయితే కవిత హైదరాబాద్‌లో నిరహారదీక్ష చేయడం విడ్డురంగా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పార్టీలో కచ్చితంగా పోరడాలని కోరారు.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చారిత్రామ్మక ప్రయత్నానికి సపోర్ట్ చేయాలని మంత్రి పొన్నం కోరారు.

Related News

Jubileehills Bypoll: జూబ్లీహిల్స్ తెరపైకి జనసేన.. టీడీపీ మౌనం కాంగ్రెస్ కి లాభమేనా?

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Say No to Drug: ‘సే నో టు డ్రగ్స్’ పేరుతో రాష్ట్రంలో క్రికెట్ టోర్నమెంట్.. ప్రైజ్ మనీ అక్షరాల రూ.80 లక్షలు

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Jubilee Hills: ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ మాత్రమే లౌకిక పార్టీ: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Jubilee Hills By-election: ఈ నెల 11 లోపు కేసీఆర్, హరీష్ రావులను సీబీఐ అరెస్ట్ చేయాలి.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Jubilee Hills Bypoll: కాంగ్రెస్ మైలేజ్ తగ్గిందా? ప్రచారంపై అధిష్టానం నిఘా

Hyderabad: గన్‌తో బెదిరింపులు.. మాజీ డిప్యూటీ సీఎం వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. అసలేంటి ఈ గొడవ

Big Stories

×