BigTV English
Advertisement

Duvvada Srinivas: నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా? పవన్ డబ్బులకు అమ్ముడు పోయాడు

Duvvada Srinivas: నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా? పవన్ డబ్బులకు అమ్ముడు పోయాడు

Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన ఫిర్యాదుతో హిరమండలం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్‌పై గతంలో దువ్వాడ చేసిన వ్యాఖ్యలే ఈ కేసుకు కారణమయ్యాయి. పవన్ చంద్రబాబు దగ్గర నుంచి నెలకు రూ.50 కోట్లు తీసుకుంటున్నారని, అందుకే ఆయనను ప్రశ్నించడంలేదని దువ్వాడ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు జనసేన అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో జనసేన నేత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


తాజాగా దువ్వాడ ఈ కేసుపై మాట్లాడుతూ.. గడిచిన ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఆయన పవన్ కళ్యాణ్ పై మాట్లాడిన మాటలను బిగ్ టీవీతో పంచుకున్నారు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్.. ఎందుకు ప్రశ్నించడం మానేశారు. మీరు డబ్బులు తీసుకుని ప్రశ్నించడం మానేశారని అందురూ చెప్పుకుంటున్నారు.. నేను అదే మీకు అడుగాను. ఒక పౌరుడిగా.. ఒక కౌన్సిల్ సభ్యుడిగా, ఒక ఎమ్మెల్సీగా అర్హతతోనే ప్రశ్నించాను. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షపార్టీ నుంచి వివిధ రకాలమైన ప్రశ్నలు సందిస్తాం.. అనుమానాలపైన, అభిప్రాయాలపైన మాట్లాడుతాం. ప్రశ్నించడం రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు. దీనికి హిరమండలం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని పోలీసులు నా ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు. హిరమండలంలోనే కాదు రాష్ట్రంలో చాలా చోట్ల కూడా తనమీద కేసులు పెట్టారని అప్పుడు తెలిసింది..

సమాచారం కూడా అందించి అన్నారు. నిజం మాట్లాడినందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు. మరి ఈ కేసులపై అరెస్ట్ చేస్తారా లేదా అనే తనకు తెలియదు దువ్వాడ అన్నారు. శ్రీకాకులం జిల్లా హిరమండలం పోలీసులు వచ్చి తనపై (IPC) 350, 351 సెక్షన్లు మరియు ఐటీ యాక్ట్‌లోని 67 సెక్షన్ కేసు నమోదు అయినట్లు తెలిపారు. రాజకీయ విమర్శలకి కూడా సర్దుబాటు లేదా? అని ఆయన ప్రశ్నించారు. తన వ్యాఖ్యల్లో ఏ తప్పూ లేదని, ఎవరినీ దూషించలేదని, అన్నారు. తాను తప్పు చేసినట్లు ఏ ఆధారమూ లేకుండా నన్ను బలవంతంగా నిందించడమేంటీ? అన్నారు. తనపై జరుగుతున్న విమర్శలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అన్నింటినీ తేలికగా తీసుకుంటున్న దువ్వాడ, నోటీసులు తనను దిగజార్చలేవని, ప్రజల్లో నిజాన్ని బయటపెట్టడానికి తానే సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఒక సారి ముందుకొచ్చి చూసుకోండి. నిజాలు ఎవరివైపున్నాయో అర్థమవుతుంది అన్నారు.


సస్పెండ్ చేసింది జగన్ మోహన్ రెడ్డి కాదు ధర్మాన ప్రసాదరావు..

తాను ఈరోజు ఇండిపెండెంట్ గా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. తన వ్యక్తి గత కారణాల వల్ల నన్ను సస్పెండ్ అయినా.. అన్ని వాస్తవాలపై నేను ప్రశ్నిస్తాను. ఇప్పటికీ తప్పు జరిగితే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత, ఆవశ్యకత తనకుందని దువ్వాడ అన్నారు. దీనిపై ఎలాంటి మార్పు రాదు. నోటీసులతో విమర్శించిన వారిని పొగడటం అనేది జరగదని తెలిపారు. ఇప్పటి వరకు పొగిడిన వారిని తగ్గించి మాట్లాడటం అనే ప్రశక్తే లేదని ఆయన అన్నారు. నాకు దుర్మార్గమైన రాజకీయాలు చేయడం రాదు.. తాను సూటిగా ప్రశ్నిస్తూనే ఉంటాను అని దువ్వాడ తెలిపారు. తన సస్పెన్సన్ కి కారణం జగన్ మోహన్ రెడ్డి కాదని ధర్మాన ప్రసాదరావు అని దువ్వాడ తెలిపారు. పార్టీలో చేరి కృష్ణదాస్ తో చేతులు కలిపి తనని సస్పెండ్ చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ధర్మాన ప్రసాద్ కు దువ్వాడ సవాల్.. దమ్ముటే నిరూపించు

దీనికి గల కారణం జిల్లా నాయకత్వం. ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, అచ్చెన్నాయుడుతో చేతులు కలిపి, వారి కుంటుంబాలతో గత 30 సంవత్సరాలుగా ఉంది. ఆ నేపథ్యాన్నే తాను తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ రాజకీయాల్లో వచ్చాను. జిల్లాలో అంతర్గత, అవగాహన రాజకీయాలను చీల్చి ఛండాలడమే తాను చేశానని అన్నారు. వాళ్లు నన్ను హింసించారు.. అందుకే వారిని నేను టార్గెట్ చేశాను. తాను చేయలేదు అన్నారు. క్రమశిక్షణ కమిటీకి అందిన పలు ఫిర్యాదు మేరకు తనని సస్పెండ్ చేశానని చెప్పాని మీరు.. ఏం తప్పు చేశానో నిరూపించాలని సవాల్ విసిరారు. ధర్మాన మాదిరి ఇసుక దందా, భూ ఆక్రమణ, ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయలేదని అని అన్నారు. మరి దీనిపై ధర్మాన రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Related News

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Nara Bhuvaneshwari: లండన్ వేదిక.. నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 పురస్కారం

Minister Lokesh: అప్పుడప్పుడూ ఏపీకి.. జగన్ ది వేరే భ్రమాలోకం.. మంత్రి లోకేశ్ ఫైర్

Syamala Ysrcp: నేను చెప్పిందేంటి? మీరు రాసిందేంటి? మీడియాపై చిందులు తొక్కిన శ్యామల

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Nara Lokesh: మంత్రి లోకేష్ సరికొత్త రికార్డ్.. 4వేలమందితో ప్రజా దర్బార్.. ప్రతి ఒక్కరితో వన్ టు వన్ ఇంటరాక్షన్

Rajamohan Reddy: మేకపాటి మాటలు.. జగన్ చెవిలో పడేనా?

Pawan Kalyan: రోడ్లపై నిర్లక్ష్యం.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వార్నింగ్!

Big Stories

×