The Raja Saab : మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా ది రాజా సాబ్. ఈ సినిమాను ముందుగా డిసెంబర్ 5న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ డేట్ ను బాలీవుడ్ మార్కెటును దృష్టిలో పెట్టుకొని అనౌన్స్ చేశారు. కానీ అసలైన తెలుగు మార్కెట్ సంక్రాంతికి మొదలవుతుంది. మొత్తానికి అన్ని సినిమాలు కంటే ముందు సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నిన్న విడుదలైంది. అసలు ప్రభాస్ తో మారుతి ఏం చేశాడో అని సందేహించిన వాళ్ళందరికీ కూడా ట్రైలర్ తో సప్రైజ్ చేశాడు మారుతి (director Maruti). అన్నిటిని మించి ప్రభాస్ ని అందంగా చూపించే విధానం విపరీతంగా ఆకట్టుకుంది. ట్రైలర్ లో కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్. విఎఫ్ఎక్స్ విషయంలో కూడా ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ఇక్కడితో అయిపోలేదు.
ట్రైలర్ వచ్చిన వెంటనే చాలామంది విపరీతంగా ఎంజాయ్ చేశారు. సినిమా రిలీజ్ కి నాలుగు నెలల ముందు ట్రైలర్ వదలడం అనేదే డేరింగ్ స్టెప్. అయితే ఈ ట్రైలర్ ను రాజా సాబ్ సెట్స్ లో కూడా ప్లే చేసి చిత్ర యూనిట్ అంతా కూడా చూశారు. వీళ్ళలో ప్రభాస్ లేరు కానీ యూనిట్ అంతా కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు.
కమెడియన్ సత్య, మారుతి, మాళవిక మోహన్ వీళ్లందరి ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ట్రైలర్ ఎంత ఎంజాయ్ చేశారో అర్థమవుతుంది. సెట్స్ లో కొంతమంది మారుతిని పైకి లేపి అరవడం మొదలుపెట్టారు.
#TheRajaSaabTrailer was screened on the sets yesterday and the reactions said it all ❤️🔥❤️🔥#TheRajaSaab is all set to redefine the magnitude of cinematic experience this Sankranthi – January 9th, 2026 🔥🔥https://t.co/OQZXkLwbrZ#TheRajaSaabOnJan9th #Prabhas @DuttSanjay… pic.twitter.com/9m0wgYAxwM
— People Media Factory (@peoplemediafcy) September 30, 2025
పిక్చర్ అభి బాకీ హై అంటే అర్థం సినిమా ఇంకా అయిపోలేదు ఉంది అని. ఈ డైలాగ్ షారుక్ ఖాన్ (Shahrukh Khan) నటించిన ఓం శాంతి ఓం (Om Shanti Om) సినిమాలోది. లైఫ్ కూడా సినిమా లాంటిదే, జీవితం ఎండింగ్ అయ్యేసరికి అంతా సక్రమంగా ఉంటుంది. ఒకవేళ సక్రమంగా లేదు అంటే పిక్చర్ అభి బాకీ హై మేరీ దోస్త్ (Picture Abhi Baki Hai mere dost) అనే డైలాగ్ చెప్తాడు. అయితే ఈ డైలాగ్ ను కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని రకాలుగా వాడుతారు.
మరోసారి మారుతి కూడా ఇదే డైలాగ్ వాడారు. అంటే సినిమా ఇక్కడితో అయిపోలేదు ఇంకా బాకీ చాలా ఉంది. దానిని థియేటర్ లో చూపిస్తాను. ఈ విధంగా మాస్ స్టేట్మెంట్ ఒక్క డైలాగ్ తో ఇచ్చేశాడు.
Also Read: Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!