E-Paper
Advertisement

Tilak Varma: సీఎం రేవంత్ కు తిలక్ వర్మ క్రేజీ గిఫ్ట్‌…నారా లోకేష్ ఒక్క‌డికే కాదు !

Tilak Varma: సీఎం రేవంత్ కు తిలక్ వర్మ క్రేజీ గిఫ్ట్‌…నారా లోకేష్ ఒక్క‌డికే కాదు !
Advertisement

Tilak Varma:  ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ హీరో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అన్న సంగతి తెలిసిందే. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కారణంగా టీమిండియా ఫైనల్స్ లో విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. అయితే ఈ మ్యాచ్ గెలిపించిన నేపథ్యంలో… దేశవ్యాప్తంగా రియల్ హీరోగా మారిపోయాడు తిలక్ వర్మ. అలాంటి తిలక్ వర్మ తాజాగా తెలంగాణ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సమావేశమయ్యారు.

Also Read: Arshdeep Singh: పాకిస్థాన్ ను దారుణంగా ట్రోల్ చేసిన అర్ష్ దీప్‌…Final Match, What’s Happening…అంటూ

సీఎం రేవంత్ రెడ్డికి అదిరిపోయే గిఫ్ట్

Advertisement

ఆసియా కప్ గెలిచిన తర్వాత.. హైదరాబాద్ గడ్డపై నిన్న రాత్రి అడుగుపెట్టారు తిలక్ వర్మ. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా యువ క్రికెటర్ తిలక్ వర్మ కలిశారు. దీంతో తిలక్ వర్మాను సత్కరించి అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డికి అదిరిపోయే గిఫ్ట్ కూడా ఇచ్చాడు తిలక్ వర్మ. ఫైనల్ లో తాను పట్టిన క్రికెట్ బ్యాట్ ను సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్టుగా బహుకరించారు తిలక్ వర్మ. దీంతో ఆ బ్యాట్ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం.. బ్యాట్ ఊపుతూ… ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కాసేపు క్రికెటర్ గా మారిపోయారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి… పోస్ట్ కూడా పెట్టారు. పాకిస్తాన్ పై టీమ్ ఇండియాను గెలిపించినందుకుగాను తిలక్ వర్మాను అభినందించినట్లు గుర్తు చేశారు.

నారా లోకేష్ కు కూడా గిఫ్ట్ ఇచ్చిన తిలక్ వర్మ

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన మరో యువరాజ్ తిలక్ వర్మ… ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. హైదరాబాద్ కుర్రాడు ఏం ఆడుతాడులే అని అందరూ అనుకుంటే… అంచనాలను మించి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత… ఫైనల్ రోజు తాను ధరించిన క్యాప్ ను మంత్రి నారా లోకేష్ కు గిఫ్ట్ గా పంపిస్తున్నట్లు పోస్ట్ పెట్టాడు తిలక్ వర్మ. ఏపీకి వచ్చిన తర్వాత ఆ క్యాప్ నారా లోకేష్ కు ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని నారా లోకేష్ కూడా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ్ముడు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ట్వీట్ కూడా చేశారు నారా లోకేష్. ఇక తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు తిల‌క్ వ‌ర్మ‌. ఈ సంద‌ర్భంగా ఫైనల్ లో తాను పట్టిన క్రికెట్ బ్యాట్ ను సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్టుగా బహుకరించారు తిలక్ వర్మ.

Advertisement

Also Read: Asia Cup 2025 : రింకూ సింగా మజాకా.. కార్డు పైన రాసి మరి… విన్నింగ్ షాట్ ఆడాడు.. అదృష్టం అంటే అతడిదే

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×