Tilak Verma : ఆసియా కప్ 2025 (Asia Cup Final) ఫైనల్ మ్యాచ్ టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్ మ్యాచ్ లో ఓపెనర్లు శుబ్ మన్ గిల్, అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ త్వర త్వరగా ఔట్ అయ్యారు. అయినప్పటికీ టీమిండియా గెలుపు తీరాలకు తీసుకొచ్చాడు తిలక్ వర్మ. అయితే ఇప్పుడు తిలక్ వర్మ సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. అసలు తిలక్ వర్మ సొంత రాష్ట్రం ఏది..? అతనిది తెలంగాణ అని కొందరూ.. ఆంధ్రా అని మరికొందరూ మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు అతని సొంత రాష్ట్రం గురించి మనం తెలుసుకుందాం.
Also Read : Tilak Varma: బ్యాటింగ్ చేస్తుండగా పాక్ ప్లేయర్లు రెచ్చగొట్టారు…స్లెడ్జింగ్ చేసి మరీ !
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సైతం తిలక్ వర్మ (Tilak Verma) ను అభినందించే క్రమంలో తెలంగాణ బిడ్డ అక్కడ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు.
తిలక్ వర్మ సొంత రాష్ట్రం ఏంటి..? అని సోషల్ మీడియాలో తెగ చర్చిస్తున్నారు. గుంటూరులో పుట్టిన తిలక్.. తెలంగాణ బిడ్డ ఎలా అయిండు..? అని ప్రశ్నించడం విశేషం. తిలక్ వర్మ ప్రొఫైల్ పేజీలో బర్త్ ప్లేస్ గుంటూరు అని ఉందని కొందరూ పేర్కొంటున్నారు. మరోవైపు ఇటీవల ఓ ఇంటర్వ్యూ క్లిప్ ని బయటపెట్టారు. అందులో తాను పుట్టి, పెరిగింది హైదరాబాద్ లోనే అని చెప్ప్పుకొచ్చాడు తిలక్ వర్మ. తన అన్నయ్య బీటెక్ చేశాడు. అతను బ్యాడ్మింటన్ లో నేషనల్ ప్లేయర్. అమ్మానాన్న చిన్నప్పుడు అథ్లెటిక్స్ లో పాల్గొన్నారు. దీంతో తనకు కూడా చిన్నప్పటి నుంచి క్రీడల పట్ల ఆసక్తి కలిగింది. చిన్నప్పటి నుంచి టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడేవాడిని. పదేళ్ల వయస్సులోనే క్రికెట్ లో శిక్షణ తీసుకున్నానని చెప్పాడు. నా పేరు ఠాకూర్ తిలక్ వర్మ అని ఉంటుంది. మేము ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి రాలేదు. మా తాత ముత్తాతల నుంచి ఠాకూర్ అనేది కంటిన్యూ అవుతోంది.
Also Read : RCB – Lalit Modi: అమ్మకానికి RCB… లలిత్ మోడీ చేతిలోకి వెళుతోందా… ఎన్ని కోట్లంటే ?
సలాం సార్ ని కలిసి తిలక్ వర్మ
“నాన్నది చిన్నప్పటి నుంచి మేడ్చల్. అమ్మది భీమవరం. అమ్మానాన్న ఇక్కడే పుట్టారు. నేను కూడా కూకట్ పల్లిలోనే పుట్టానని.. సలాం సార్ వద్ద శిక్షణ తీసుకున్నాను” అని వెల్లడించారు. తాజాగా లింగంపల్లిలోని సలాం సార్ ని కలిసి మీడియాతో మాట్లాడటం విశేషం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ట్వీట్ చేయడం.. అలాగే సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇలా ఒక్కరోజులోనే పాపులర్ అయ్యాడు టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ. ప్రస్తుతం ఇతని గురించి ఇంతకు ఇతనిది తెలంగాణా..? ఆంధ్రా అని చర్చించుకోవడం విశేషం.