Chennai Crime: తమిళనాడు రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా ఎన్నోర్ థర్మల్ పవర్ ప్లాంట్ లో నిర్మాణంలో ఉన్న శ్లాబ్ కూలి 9 మంది కూలీలు స్పాట్ లో మృతి చెందారు. పవర్ ప్లాంట్ భారీ వలయం నిర్మిస్తున్న సమయంలో ఇసుప కమ్మీలు విరిగి కింద పడడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన తోటి కూలీలు వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారిని నార్త్ ఇండియన్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగింది..? ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి..? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Weather News: ఈ జిల్లాల్లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్, ఈ టైంలో బయటకు వెళ్లొద్దు