Kantara Chapter1: కన్నడ హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty) ప్రధాన పాత్రలో నటించిన కాంతార చాప్టర్ 1(Kantara Chapter1) సినిమా మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమాకు ఊహించని ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వచ్చారు. ఇక ఈ సినిమా అక్టోబర్ రెండవ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఒకటవ తేదీ నుంచి ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి.
ఇక ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగులో ఈ సినిమాకు టికెట్ ధరలను పెంచమని ఏపీ ప్రభుత్వాన్ని కోరడంతో ఏపీ ప్రభుత్వం సైతం కాంతార చాప్టర్ 1 సినిమా టికెట్ ధరలను(Ticket Price) పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమా టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ75 వరకు పెంచగా మల్టీప్లెక్స్ లలో రూ.100 పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ధరలకు అక్టోబర్ 2 నుంచి 11 వరకు అనుమతి తెలియజేశారు.ఇలా కాంతార సినిమాకు సినిమా టికెట్ల రేట్లను పెంచడంతో అల్లు అరవింద్ ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కాంతార సినిమాకు ఏపీలో టికెట్ ధరలను పెంచినందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు.
ఈ సినిమా తెలుగులో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు ఏ విధమైనటువంటి ఆటంకాలు కల్పించవద్దు అంటూ పవన్ కళ్యాణ్ కూడా తెలియజేశారు. తెలుగు సినిమాలకు కర్ణాటకలో పెద్ద ఎత్తున నిరసన సెగలు తగులుతున్నాయి. అయితే తెలుగులో మాత్రం కన్నడ సినిమాలకు ఆటంకాలు కల్పించవద్దు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడంతో కొంతమేర అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రిషబ్ శెట్టి ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పూర్తిగా కన్నడ భాష మాట్లాడటంతో ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తం చేశారు.
రిషబ్ స్వీయ దర్శకత్వంలో..
ఈ సినిమాకు నిరసనలు వస్తున్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ సినిమా విడుదలకు ఆటంకాలు కల్పించవద్దని కోరడమే కాకుండా సినిమా టికెట్ల ధరలను కూడా పెంచుతూ ఉత్తర్వులను జారీ చేశారు. ఇక కాంతార చాప్టర్ 1 సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కాంతార సినిమాకు సీక్వెల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాలో రిషబ్ కు జోడిగా రుక్మిణి వసంత్ నటించిన హోంభలే నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించారు.
Also Read: Varun Tej son: మెగా ఇంట మరో వేడుక..ఘనంగా మెగా వారసుడు బారసాల వేడుక!