Priyanka Mohan : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్స్ అండ్ ప్లాప్స్ అతీతంగా క్రేజ్ ను సంపాదించిన అతి తక్కువ మంది వ్యక్తులలో పవన్ కళ్యాణ్ ఒకడు. పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ ఫిలిం ఓజి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమాకు కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి. పవన్ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చిన సినిమా ఇది.
ఈ సినిమాలో సుజిత్ హీరోకి కూడా ఒక ఫ్యామిలీ ఉండాలి అనే డిజైన్ చేశాడు కాబట్టి ప్రియాంక అరుళ్ మోహన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసాడు. ఈ సినిమా నుంచి ఈవిడికి సంబంధించిన రిలీజ్ చేసిన పోస్టర్స్ కూడా చాలా ఆసక్తికరంగా కనిపించాయి. అసలు ఈ సినిమా పోస్టర్స్ విషయంలో సుజిత్ తీసుకున్న కేర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.
ఈ సినిమాలో ప్రియాంక పాత్రకు కన్మణి అనే పేరు పెట్టాడు సుజిత్. అలానే ఆ పాత్రను కూడా అద్భుతంగా డిజైన్ చేశాడు. పవన్ కళ్యాణ్ తో ప్రియాంకకు సాగే పాట కూడా చాలా బాగుంటుంది. అయితే పాట విడుదల చేసినప్పుడే వీళ్లిద్దరి పేరు చాలా క్యూట్ గా ఉంది అని అనిపించింది. సినిమాలో చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది.
అయితే సినిమా షూటింగ్ జరిగినప్పుడు సెట్స్ లో స్టిల్ ఫోటోగ్రాఫర్ కొన్ని ఫొటోస్ తీయడం సహజంగా జరుగుతుంది. సినిమా రిలీజ్ అయినంత వరకు ఆ ఫోటోలను చాలావరకు బయట పెట్టరు. ఎందుకంటే ఆ ఫోటోలు బయటకు రావటం వలన ఆడియన్స్ సర్ప్రైజ్ ఫీల్ అవ్వడం తగ్గిపోతుంది. అలానే ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతాయి. అందుకోసమే ఆ ఫోటోలను రిలీజ్ వరకు దాస్తారు.
ప్రియాంక మోహన్ ఓజీ సినిమా షూటింగ్లో పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫొటోస్ అన్నిటిని కూడా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. వీళ్ళ పెయిర్ చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. అలానే ఫొటోస్ లో వారిద్దరి క్లోజ్ నెస్ చాలా బాగుంది. సెట్స్ లో ఫొటోస్ ను షేర్ చేయడం మాత్రమే కాకుండా ఖుషి సినిమాలో సూపర్ హిట్ సాంగ్ చెలియా చెలియా పాటను బ్యాక్ గ్రౌండ్ లో పెట్టింది. ఈ ఫొటోస్ అన్నీ చూస్తుంటే ఇంకా ఓజీ సినిమా వైబ్ లోనే ప్రియాంక మోహన్ ఉండిపోయింది అని అర్థమవుతుంది.
Also Read: The Raja Saab : పిక్చర్ అభి బాకీ హై, రాజా సాబ్ సెట్స్ లో మారుతి మాస్ స్టేట్మెంట్