Poonam Kaur: పూనమ్ కౌర్(Poonam kaur) ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఈమె సినిమాలలో నటించింది చాలా తక్కువ కానీ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు, వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తూ బాగా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తాజాగా పూనమ్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ కాస్త బాలకృష్ణను(Balakrishna) ఉద్దేశించి చేయడంతో మరోసారి సోషల్ మీడియాలో బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి(Chiranjeevi) అనే విధంగా చర్చలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా పూనమ్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ…
“బాలయ్య ఎప్పుడు చిన్నపిల్లాడిలాగే ఎంతో ఉత్సాహంగా ఉంటారని నేను తరచూ చెబుతూ ఉంటాను. అయితే దేవుడు కొంతమంది వ్యక్తులను ఓ లక్ష్యం కోసమే ఒక సాధనంలా సృష్టిస్తాడు. అది సమయాన్ని బట్టి బయటపడుతుంది” అంటూ ఈమె ట్వీట్ చేశారు. అయితే ఉన్నఫలంగా ఇలా బాలకృష్ణ గురించి ప్రశంసలు కురిపిస్తూ ఈమె ట్వీట్ చేయటంతో కచ్చితంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిందని, అందుకే బాలకృష్ణను ఉద్దేశించి ఇలాంటి పోస్ట్ చేశారని అభిమానులు పెద్ద ఎత్తున ఈ విషయంపై చర్చలు జరపడమేకాకుండా సోషల్ మీడియాలో కూడా మరోసారి బాలయ్య చిరు అభిమానుల మధ్య ఈ పోస్ట్ అగ్గి రాజేసింది.
ఇక పూనమ్ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని టార్గెట్ చేస్తూ ఆయనపై విమర్శలు కురిపిస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణ మధ్య వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఈమె బాలకృష్ణకు మద్దతుగా ఈ పోస్ట్ చేశారని స్పష్టమవుతుంది. అయితే బాలకృష్ణ ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా చిరంజీవి గురించి వ్యంగ్యంగా మాట్లాడిన నేపథ్యంలో చిరంజీవి కూడా బాలకృష్ణకు తనదైన శైలిలోనే కౌంటర్ ఇస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇలా బాలకృష్ణ చట్టసభలలో తమ అభిమాన హీరో గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.
🫶 ballaya – as I always said child like energy – god makes people instrument for a purpose which is revealed with time 😇. https://t.co/b0VufEUBw8
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 30, 2025
బాలకృష్ణ బహిరంగంగా చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని లేకపోతే తమ నిరసనల కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు . అలాగే బాలకృష్ణపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేయడానికి కూడా అభిమానులు వెళ్లడంతో చిరంజీవి అభిమానులకు నచ్చ చెప్పారు. ఇలా బాలకృష్ణకు వ్యతిరేకంగా నిరసనలు వస్తున్నప్పటికీ కూడా బాలయ్య ఈ ఘటనపై ఎక్కడ స్పందించలేదు. ఇలా ఈ వివాదం కారణంగా మరోసారి బాలకృష్ణ చిరంజీవి మధ్య ఉన్న విభేదాలు గురించి ఇండస్ట్రీలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలోనే పూనమ్ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనగా మారింది.
Also Read: Kantara Chapter1: కాంతారకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. భారీగా ధరలు పెంపు!