IMDB Movie list:సాధారణంగా ప్రతి ఏడాది కూడా ఐఎండిబి మోస్ట్ పాపులర్ ఇండియన్ చిత్రాల జాబితాను విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి ఏకంగా 25 సంవత్సరాలకు సంబంధించి టాప్ 100 మూవీస్ లిస్టును విడుదల చేయగా.. అందులో మన తెలుగు చిత్రాల స్థానం సంపాదించుకోవడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళితే.. 2000 సంవత్సరం నుండి 2025వ సంవత్సరం వరకు ఈ 25 ఏళ్లలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిస్టారికల్, కామెడీ, ఫ్యామిలీ, హారర్ చిత్రాలు వచ్చాయి.. అందులో బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు కూడా ఉన్నాయి.
అయితే నెంబర్ వన్ స్థానం మాత్రం హిందీ చిత్రానికి లభించినా.. ఇందులో మన తెలుగు చిత్రాలు కూడా స్థానం దక్కించుకున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. 25 ఏళ్ల మోస్ట్ పాపులర్ చిత్రాల నివేదికను ప్రకటించింది ఐఎండిబి. ఇందులో ప్రభాస్ బాహుబలి 1 &2 , అల్లు అర్జున్ పుష్ప 1&2 వంటి తెలుగు చిత్రాలు విశేష ఆదరణ పొందిన వాటిలో నిలిచాయి. తొలుత హిందీ చిత్రాల ప్రభావం ఉన్నా.. ఆ తర్వాత దక్షిణాది సినిమాలు సత్తా చాటాయని భాష పరంగా పరిధులు లేవని ఐఎండీబీ తెలిపింది. ఈ నివేదిక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ 250 మిలియన్ల వినియోగదారుల అభిప్రాయం సేకరించినట్లు స్పష్టం చేసింది. ఏది ఏమైనా ఇన్ని సంవత్సరాల కాలంలో మన తెలుగు చిత్రాలు సత్తా చాటడం సంతోషంగా ఉందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఐఎండిబి విడుదల చేసిన తాజా జాబితాలో స్థానం దక్కించుకున్న మొదటి 9 చిత్రాల విషయానికి వస్తే..
1. 3 ఇడియట్స్ (2009)
2. దంగల్ (2016)
3. లైక్ స్టార్స్ ఆన్ ఎర్త్ (2007)
4. పీకే (2014)
5. లగాన్ (2001)
6. స్వదేశ్ (2004)
7. మున్నాభాయ్ ఎంబీబీఎస్ (2003)
8. దృశ్యం (2015)
9. 12th ఫెయిల్ (2023)
అమీర్ ఖాన్ చిత్రాల డామినేషన్..
ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి చిత్రాలు సత్తా చాటినా ఇక్కడ మొదటి స్థానం అమీర్ ఖాన్ 3 ఇడియట్స్ కి లభించడం ఆశ్చర్యకరమనే చెప్పాలి. అయితే నిజానికి ఈ సినిమా ఆస్ట్రేలియాలో కూడా రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు సొంతం చేసుకుంది .మొదటి మోడ్రన్ ఇండియన్ సినిమాలలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా చైనాలో కూడా పెద్ద హిట్ అందుకుంది. అంతేకాదు చైనీస్ యూనివర్సిటీలు క్లాస్ రూమ్లలో స్ట్రెస్ రిలీఫ్ కోసం ఈ సినిమాను కోర్స్ వర్క్ లో కూడా పెట్టడం గమనార్హం. అలా ఇతర దేశాలలో కూడా భారీ పాపులారిటీకి దక్కించుకోవడం నిజంగా ప్రశంసనీయమని చెప్పాలి. అంతేకాదు ఈ 25 ఏళ్లలో అమీర్ ఖాన్ సినిమాల డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోందని చెప్పవచ్చు.
ALSO READ:OTT Movie: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే!