BigTV English

OTT Movie : ప్రేయసిని వెతుక్కుంటూ వెళ్తే గ్యాంగ్ స్టర్ తగిలాడు… కిక్కెక్కించే మలయాళ లవ్ స్టోరీ

OTT Movie : ప్రేయసిని వెతుక్కుంటూ వెళ్తే గ్యాంగ్ స్టర్ తగిలాడు… కిక్కెక్కించే మలయాళ లవ్ స్టోరీ

OTT Movie : రొమాంటిక్, కామెడీ, యాక్షన్ జానర్లతో, ఒక మలయాళం సినిమా దసరా పండక్కి డబుల్ బొనాంజా ఇవ్వబోతోంది. ఈ సినిమా థియేటర్లలో కూడా మంచి టాక్ తెచ్చుకుంని, నెల లోపే ఓటీటీ పట్టాలు ఎక్కబోతోంది. ఈ సినిమా మంచి మైండ్ రిలీఫ్ ఎంటర్టైనర్ గా చెప్పుకోవచ్చు. ఒక సిగ్గుపడే స్వభావం ఉన్న వ్యక్తి తన ప్రేమను పొందడానికి రెబెల్ గా మారుతాడు. ఈ మధ్యలో వచ్చే, ట్విస్టులు, కామెడీ సీన్స్ ఆడియన్స్ చేత కేక పెట్టిస్తాయి. ఈ సినిమా ఈ వారంలోనే ఓటీటీలోకి రాబోతోంది. ఈసినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ కి రానుంది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘మేనే ప్యార్ కియా’ (Maine pyar kiya) 2025 ఆగస్టు 29న థియేటర్లలో విడుదలైన మలయాళ రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. దీనికి ఫైజల్ ఫజిలుదీన్ దర్శకత్వం వహించారు. ఇందులో హృదు హారూన్, ప్రీతి ముఖుందాన్ ప్రధాన పాత్రల్లో నటించగా, మిదుట్టి, అర్జ్యూ, జెఓ బేబీ, శ్రీకాంత్ వెట్టియార్, రెడిన్ కింగ్స్లీ మిగతా పాత్రల్లో నటించారు. స్పైర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంజు ఉన్నితాన్ నిర్మించిన ఈ చిత్రం, IMDbలో 8.3/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా Lionsgate Play లో అక్టోబర్ 3 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

స్టోరీలోకి వెళ్తే 

ఆర్యన్ అనే యువకుడు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కేరళలోని ఒక చిన్న ఊరిలో ఉంటాడు. అతనికి సిగ్గుపడే స్వభావం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అతన్ని చూస్తే మంచితనం అతని ఇంటి పేరు ఏమో అనిపిస్తుంది. ఒక రోజు అతను నిధి అనే తమిళ అమ్మాయిని కలుస్తాడు. నిధి మాత్రం చాలా చురుకైన అమ్మాయి. వాళ్ళు కోచింగ్ సెంటర్‌లో కలిసి, తొందరగానే ప్రేమలో పడతారు. వీళ్ళ ప్రేమ కథ చాలా క్యూట్‌గా మొదలవుతుంది. ఫోన్ కాల్స్, టెక్స్ట్స్, చిన్న చిన్న డేట్స్‌తో ప్రేమలో మునిగి తేలుతుంటారు. కానీ సమస్య ఏంటంటే, నిధి తల్లిదండ్రులు ఆమెకు మరో అబ్బాయితో అరేంజ్డ్ మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు. ఆర్యన్‌కి ఈ విషయం తెలుస్తుంది. కానీ అతనికి మొహమాటం ఎక్కువగా ఉండటం వల్ల నిధి ఫ్యామిలీతో డైరెక్ట్‌గా మాట్లాడలేకపోతాడు.


ఈ సమయంలో అతని ఫ్రెండ్స్ అయిన రాజు, కిషోర్ ఆర్యన్ కి సపోర్ట్ చేస్తారు. వీళ్ళు పెద్ద ఫన్నీ గ్యాంగ్, ఎప్పుడూ జోక్స్ వేస్తూ, ఆర్యన్‌ని ధైర్యంగా మాట్లాడమని పుష్ చేస్తారు. ఒక రోజు నిధి మధురైలో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి వెళ్తుంది. ఆర్యన్ ఆమెను కలవడానికి, తన ప్రేమను వాళ్ళ ఫ్యామిలికి చెప్పడానికి మధురై వెళ్తాడు. కానీ ఇక్కడ నుండి కథలో గందరగోళం మొదలవుతుంది. ఆర్యన్ ఒక పొరపాటు చేస్తాడు. అతను నిధి ఫ్యామిలీ అనుకుని తప్పుగా వేరే వ్యక్తులతో మాట్లాడతాడు. ఇది ఒక ఫన్నీ మిస్‌ అండర్‌స్టాండింగ్‌కి దారితీస్తుంది.ఇది కథకి ఫన్ తీసుకొస్తుంది. ఇంతలో మధురైలో ఆర్యన్ అతని ఫ్రెండ్స్ ఒక సమస్యలో చిక్కుకుంటారు. నిధి ఫ్యామిలీ ఉండే ఏరియాలో ఒక చిన్న క్రైమ్ గ్యాంగ్ ఉంటుంది. ఈ గ్యాంగ్ ఒక లోకల్ డీల్‌లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దీనికి సంబంధించి ఆర్యన్ పొరపాటున వాళ్ళ రాడార్‌లోకి వస్తాడు.

ఆర్యన్ అనుకోకుండా ఒక బ్యాగ్‌ని తీసుకుంటాడు. అందులో గ్యాంగ్‌కి చెందిన ముఖ్యమైన వస్తువు ఉందని తెలుస్తుంది. ఇక్కడి నుండి కథ కామెడీ ఆఫ్ ఎర్రర్స్‌గా మారుతుంది. ఆర్యన్ గ్యాంగ్ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ అతని ఫన్నీ ఫ్రెండ్స్ వల్ల మరిన్ని గందరగోళాలు జరుగుతాయి. ఈ లోపల నిధి తన ఫ్యామిలీతో ప్రెషర్‌ లో పడుతుంది. ఆమె తల్లిదండ్రులు ఆమెను అరేంజ్డ్ మ్యారేజ్ అబ్బాయితో కలవమని ఒత్తిడి చేస్తారు. నిధి ఆర్యన్‌ని లవ్ చేస్తుంది, కానీ ఆమె ఫ్యామిలీ వల్ల సైలెంట్‌గా ఉంటుంది. ఆర్యన్ నిధిని కలవడానికి ట్రై చేస్తూ, గ్యాంగ్‌తో గొడవల్లో చిక్కుకుంటాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులకు మైండ్ బెండ్ అవుతుంది. నిధి తల్లిదండ్రులు ఆర్యన్ ప్రేమను అంగీకరిస్తారా ? అరేంజ్డ్ మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుందా ? క్రిమినల్ గ్యాంగ్ నుంచి వీళ్ళు బయట పడతారా ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : అందం కోసం అరాచకం… మనిషి మాంసాన్ని మటన్ లా తినే ఊరు… మెంటలెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

Related News

OTT Movie : లవ్ స్టోరీ నుంచి క్రైమ్ వరకు… ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న మలయాళ సినిమాలు

OTT Movie : ప్రేమ పెళ్ళికి పెద్దలు ఒప్ప్పుకోలేదని… ‘వోల్ఫ్’ ఎంట్రీతో ఊహించని టర్న్ … గిలిగింతలు పెట్టే మలయాళ క్రైమ్ కామెడీ

OTT Movie: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే!

Junior movie OTT: సైలెంట్ గా మరో ఓటీటీలోకి వచ్చిన జూనియర్.. ఇక్కడి పరిస్థితేంటో ?

OTT Movie : అప్పు కట్టలేదని కన్నపిల్లల కళ్ళముందే ఘోరంగా… మనసును మెలిపెట్టే ఫీల్ గుడ్ స్టోరీ

OTT Movie : భర్త ఉండగానే భార్యపై అఘాయిత్యం… ఒక్కొక్కడినీ ముక్కలు ముక్కలుగా నరికి… ఈగోను సాటిస్ఫై చేసే రివేంజ్ భయ్యా

OTT Movie : కూతురి ఫోన్లో అలాంటి వీడియోలు… తండ్రి ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్ భయ్యా

Big Stories

×