CM Chandrababu: ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 రూపోందిస్తే.. తాము స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన చేశామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సంపద సృష్టికి పెట్టుబడులు రావాలని.. సంపద సృష్టిస్తేనే పేదరికాన్ని నిర్మూలించగలమని సీఎం పేర్కొన్నారు. 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యమని అన్నారు. ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్య సదస్సు కర్టైన్ రైజర్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖలో నిర్వహించే 30వ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామిక వేత్తలను, వివిధ దేశాల రాయబారులను సాదరంగా ఆహ్వానిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. నవంబరు 14, 15వ తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకూ 7 సార్లు సీఐఐ భాగస్వామ్య సదస్సులు నిర్వహించామని అన్నారు. పరిశ్రమలకు అనువుగా ఉండేలా లాజిస్టిక్స్ ను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారుల నిర్మాణం చేపడుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ALSO READ: AP Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. మత్స్యకారులకు అలర్ట్
సంపద సృష్టికి పెట్టుబడులు రావాలని.. సంపద సృష్టిస్తేనే పేదరికాన్ని నిర్మూలించగలమని సీఎం అన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 రూపోందిస్తే.. మేం స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన చేశామని చెప్పారు. ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యమని అన్నారు. దీని కోసం 10 సూత్రాలను ఆధారంగా చేసుకుని పని చేస్తున్నామని వివరించారు. లాజిస్టిక్స్, డీప్ టెక్నాలజీ, ప్రాడెక్టు పర్ఫెక్షన్ లాంటి కీలకమైన లక్ష్యాలను పెట్టుకున్నామని చెప్పారు. సమీకృత అభివృద్ధి అనేది ఇప్పుడు ఓ నినాదం… పీ4 ద్వారా సమీకృత అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
ALSO READ: TCS Layoffs: ఆందోళనలో TCS ఉద్యోగులు, ఏకంగా 30 వేల ఉద్యోగాలు అవుట్!
స్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్స్, ఏరోస్పేస్ సిటీలను ఏపీలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ‘2026 జనవరి నాటికి ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పనిచేయటం ప్రారంభిస్తుంది. ఆ తదుపరి రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్ పరికరాలను కూడా ఉత్పత్తి చేసే దశకు చేరుకుంటాం. 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పనిచేస్తోంది. పనిచేసే యువత భారత్ కు ఉన్న అతిపెద్ద వనరు. ఇదే దేశాభివృద్ధికి కీలక వనరు. పునరుద్పాదక విద్యుత్ రంగంలో 500 గిగావాట్లను దేశంలో ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశిస్తే ఏపీలోనే 160 గిగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులిస్తున్నాం’ అని సీఎం వివరించారు.