Fahad Fazil: మలయాళం స్టార్ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు ఫహద్ ఫాజిల్(Fahad Fazil). ఈయన నటన అంటే అభిమానులకే కాదు స్టార్ హీరోయిన్ లకి కూడా ఇష్టమే. అందుకే ఆలియా భట్ (Alia Bhatt) మొదలుకొని త్రిష (Trisha) వరకు చాలామంది ఈయనతో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ఈయన పుష్ప సినిమాలో విలన్ గా నటించి, తన అద్భుతమైన పాత్రతో అందరినీ ఆకట్టుకున్నారు.. ప్రస్తుతం పాన్ ఇండియా నటుడిగా పేరు తెచ్చుకున్న ఈయన.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఈయన గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కీప్యాడ్ ఫోన్ తో దర్శనమిచ్చిన ఫహద్ ఫాజిల్..
తాజాగా మాలీవుడ్ టైమ్స్ పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు ఫహద్ ఫాజిల్. ఈ వేడుకల్లో ఈయన ఫోన్ మాట్లాడుతున్న వీడియో నెట్టింట వైరల్ అయింది. దీంతో ఈ వీడియోలో ఫహద్ చేతిలో ఉన్న ఆ చిన్న కీప్యాడ్ ఫోను అందరి దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఆధునిక ప్రపంచంలో చిన్న పిల్లాడిని మొదలుకొని.. పండు ముసలాడి వరకు స్మార్ట్ ఫోన్ లేనిదే గడవడం లేదు. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు వేల రూపాయల ఖర్చు చేసి మరీ స్మార్ట్ ఫోన్స్ ను ఉపయోగిస్తున్నారు. కానీ ఇండస్ట్రీలో తోపు హీరో అయినప్పటికీ ఈయన చేతిలో కీప్యాడ్ ఫోన్ ఉండడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఫహద్ ఫాజిల్ చేతిలో కీప్యాడ్ మొబైల్ ఉండడం ఏంటి? మరీ ఇలా అయితే ఎలా సామి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
పేరుకే కీప్యాడ్.. అసలు ధర తెలిస్తే ఫ్యూసులు అవుట్..
అయితే ఫహద్ ఫాజిల్ ఉపయోగిస్తున్న కీప్యాడ్ మొబైల్ అసలు ధర తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. గ్లోబల్ బ్రాండ్ వెర్టు నుండి వెర్టు అసెంట్ – 4GB – బ్లాక్ అనే ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఒక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఫోన్ ధర $1199. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాల లక్ష రూపాయల వరకు ఉంటుందని సమాచారం. ఇక ఈ దీని ధర తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొదట ఇదొక కీప్యాడ్ అనుకొని.. ఈయన ఒక పిసినారి అనుకున్న చాలా మందికి.. దీని ధర తెలిసి ఆ రేంజ్ ఉండాల్సిందే అంటూ మళ్ళీ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ఫహద్ వాడే ఫోన్ వివరాలు ఇవే..
ఈ మొబైల్ విషయానికి వస్తే.. వెర్టు అసెంట్ టి ఫెరారీ నీరో లిమిటెడ్ ఎడిషన్ 2008లో దీన్ని ప్రారంభించింది. టైటానియం బాడీ స్క్రాచ్.. రెసిస్టెన్స్ నీలమని క్రిస్టల్ డిస్ప్లే, ఫెరారీ, లెదర్ బ్యాక్ ప్యానెల్ ను కలిగి ఉంటుంది. ఇది నోకియా ఫీచర్ ఫోన్లలో సాధారణంగా ఉపయోగించే సింబియన్ ఓఎస్ ఆధారంగా కస్టమ్ వెర్టు ఇంటర్ఫేస్ పై పనిచేస్తుంది.
ALSO READ:Jabardast Naresh: షబీనాతో లవ్ ట్రాక్.. నిజం చెప్పేసిన పొట్టి నరేష్!
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==