Harihara Veeramallu: టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేందుకు లైన్ క్లియర్ చేసుకుంది.. ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. సినిమా విడుదల ఎందుకు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ను వదులుతున్నారు మేకర్స్. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా నందమూరి హీరో రాబోతున్నట్లు సమాచారం.
‘వీరమల్లు’ ఈవెంట్ కు మాస్ హీరో..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిగా రాబోతున్న సినిమా హరిహర వీరమల్లు. ఇక ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 20న విశాఖ బీచ్ లో భారీ అభిమానుల సమక్షంలో వేడుక నిర్వహ ణకు సన్నాహాలు జరుతున్నాయి. తొలుత ఇదే ఈవెంట్ తిరుపతి లేదా విజయవాడలో నిర్వహించాలని అనుకున్నారు.. కానీ అనూహ్యంగా వేదిక మారింది. పవన్ కళ్యాణ్ వైజాగ్ లో చేయాలని సూచించడంతో మేకర్స్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిధి ఎవరు? అంటే ఓపేరు తెరపైకి వచ్చింది. ఆయనే నటసింహ బాలయ్య అని పవన్ సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది.
బాలయ్య ముఖ్య అతిధిగా ఈ వేడుక నిర్వహిద్దామని పవన్ మేకప్ కి చెప్పడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వేడుకలో సినిమా వాళ్లతో పాటు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రా కూటమి నాయకులుంతా పాల్గొంటారని వార్తలొస్తున్నాయి. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది.
Also Read : తెలుగులో త్రిపాత్రాభినయం చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?
‘హరిహర వీరమల్లు’ మూవీ అప్డేట్స్..
గతంలో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపించారు. కానీ వీరమల్లు లో పవన్ కళ్యాణ్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాదు ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కొల్లగొట్టినదిరో సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఈ చిత్రాన్ని ఏ.ఎం. రత్నం నిర్మిస్తుండగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోనుంది.. మరి రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..