Dacoit Release: ఇటీవల కాలంలో సినిమాలు పెద్ద ఎత్తున పండుగలను టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. దీపావళి పండుగ సందర్భంగా ఏకంగా నాలుగు సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి. అయితే నవంబర్ లో పెద్దగా సినిమాలు ఏవి విడుదలకు నోచుకోలేదని చెప్పాలి .కానీ డిసెంబర్ లో మాత్రం మరోసారి బాక్స్ ఆఫీస్ బరిలో చాలా సినిమాలు పోటీకి దిగుతున్నాయి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఇప్పటికే పలు సినిమాల విడుదలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హీరో అడివి శేష్ (Adivi Sesh)నటించిన డెకాయిట్(Dacoit) సినిమా కూడా క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ముందుగా చిత్ర బృందం ప్రకటించారు.
ఇకపోతే ఈ సినిమా క్రిస్మస్ రేస్ నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ఇటీవల షూటింగ్ లో ప్రమాదం జరిగిన నేపథ్యంలో హీరోకు కొద్ది రోజుల పాటు విశ్రాంతి అవసరమని చెప్పిన నేపథ్యంలో షూటింగ్ కాస్త వాయిదా పడింది. అందుకే క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల కావడం లేదు. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని అధికారకంగా ప్రకటించారు. క్రిస్మస్ పండుగకు ఈ సినిమా వాయిదా పడిన ఉగాది (Ugadi)పండుగకు విడుదల కాబోతోంది అంటూ వచ్చే ఏడాది మార్చి 19వ తేదీ విడుదల కానున్నట్లు చిత్ర బృందం అధికారక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ సినిమాలో అడివి శేష్, మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur)జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ లవ్ స్టోరీగా ఈ సినిమా హిందీ, తెలుగు భాషలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు, దర్శకుడు అనురాగ్ కస్యప్ విలన్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
టాక్సిక్ కు పోటీగా డెకాయిట్..
క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల అవుతుందనుకున్న ఈ సినిమా ఏకంగా ఉగాది పండుగకు రాబోతున్న నేపథ్యంలో అదే రోజు పాన్ ఇండియా స్టార్ హీరో యశ్ నటిస్తున్న టాక్సిక్ సినిమా కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మార్చి 19వ తేదీ విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే చిత్ర బృందం ప్రకటించారు. ఇప్పుడు డెకాయిట్ కూడా అదే రోజు విడుదల కాబోతుందని తెలియడంతో భారీ స్థాయిలో పోటీ ఉండబోతుందని పాన్ ఇండియా స్టార్ హీరోతో శేష్ పోటీకి సిద్ధమయ్యారని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ పోటీ ఇలాగే కొనసాగుతుందా లేకుంటే ఎవరైనా వెనక్కు తగ్గుతారా అనేది తెలియాల్సి ఉంది. యష్ టాక్సిక్ సినిమా షూటింగ్ పనులు ఆగిపోయాయి అంటూ వార్తలు వస్తున్నాయి కానీ అందులో నిజం లేదని దాదాపు షూటింగ్ పూర్తి అయిందని డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి అంటూ చిత్ర బృందం వెల్లడించారు. మరి ఈ పోటీలో ఎవరు ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.