Adivisesh: అడివి శేష్(Adivi Sesh) పరిచయం అవసరం లేని పేరు. నటుడిగా విభిన్నమైన సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తూ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకుంటున్నారు. కెరియర్ మొదటి నుంచి కూడా శేష్ సినిమాలు అంటేనే ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు ఉండేవి. క్షణం, గూడచారి, ఎవరు, మేజర్, హిట్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శేష్ ప్రస్తుతం డెకాయిట్, గూడచారి 2 (Gudachari 2)వంటి సినిమా పనులలో బిజీగా ఉన్నారు త్వరలోనే ఈ సినిమాలో కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.
గూడఛారి 2…
ఇలా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్న శేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే సినిమాల గురించి కూడా ఎన్నో విషయాలను తెలియచేశారు.. ఇకపోతే ఇండస్ట్రీలో కొనసాగుతున్న నటీ లేదా నటుడు వారికంటూ కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇలాంటి సినిమాలో నటించాలని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. అలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి అడివి శేష్ కు ప్రశ్న ఎదురయింది. ఈ సందర్భంగా శేష్ తన డ్రీమ్ ప్రాజెక్టు(Dream Project) గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలియచేశారు.
మహాభారతం డ్రీం ప్రాజెక్ట్…
ఇప్పటివరకు ఎన్నో విభిన్న సినిమాలలో నటించిన ఈయనకు మహాభారతం(Mahabaratam) చేయాలన్నదే తన కోరిక అని, అదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపారు. మహాభారతం చేయాలనే కోరిక ఉందని తెలిపారు. అయితే ఇప్పటికే బాలీవుడ్ లో అమీర్ ఖాన్(Aamir Khan) గారు, ఇక్కడ రాజమౌళి (Rajamouli)గారు అవే వారి డ్రీమ్ ప్రాజెక్ట్స్ గా సినిమాలు చేయబోతున్నారు అలాంటప్పుడు మనం సైలెంట్ గానే ఉండాలి అంటూ శేష్ తెలిపారు. మహాభారతం అంటే కేవలం ఒకే ప్రాజెక్టు కాదని అందులో ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలు ఉన్నాయని పరుశరాముడు గురించి, కర్ణుడు గురించి ఎంతో గొప్పగా తెలియజేయవచ్చు అంటూ మహాభారతం గురించి కొన్ని విషయాలు తెలిపారు.
రాజమౌళి ఛాన్స్ ఇస్తారా…
ఇక రాజమౌళి డ్రీం ప్రాజెక్టు మహాభారతం అని ఎప్పటికైనా ఆ సినిమా చేయడమే తన లక్ష్యం అని ఎన్నో సందర్భాలలో తెలియజేశారు. మహాభారతం సినిమానే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ శేష్ తెలపడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇదివరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి (Bahubali)సినిమాలో రానా కొడుకు పాత్రలో శేష్ నటించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా రాజమౌళి గారి మహాభారతంలో మీరు ఏదైనా ఒక పాత్ర చేయొచ్చు కదా అని ప్రశ్నించడంతో.. ఇప్పటివరకు ఈ విషయాన్ని తాను ఎక్కడా బయట పెట్టలేదని మొదటిసారి ఇక్కడ చెబుతున్నానని వెల్లడించారు. మరి శేష్ డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా మహాభారతం అనే విషయాన్ని బయట పెట్టడంతో ఈయనకు అమీర్ ఖాన్ లేదా రాజమౌళి వారి డ్రీమ్ ప్రాజెక్టులలో అడవి శేష్ కు చోటు ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
AlsonRead: వర్మ ఈజ్ బ్యాక్… బాలీవుడ్ బడాని మళ్లీ పట్టేశాడు