Ram Gopal Varma Movie : సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన దర్శకులలో రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఒకరు. ఈయన దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈయన దగ్గర ఎంతోమంది శిష్యరికం పొంది ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఒకానొక సమయంలో రాంగోపాల్ వర్మ సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై ఎన్నో అంచనాలు ఉండేవి. ఇలా తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్(Bollywood) సినిమాలను కూడా చేసిన ఘనత రామ్ గోపాల్ వర్మకు ఉందని చెప్పాలి. అయితే ఒకప్పుడు అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన వర్మ ఇటీవల కాలంలో వివాదాస్పద సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
గత కొంతకాలంగా ఈయన కొంతమంది రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ సినిమాలను చేశారు. ఈ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వర్మ ఎన్నో వాదాలను ఎదుర్కొన్నారు. ఇలా నిత్యం వివాదాలలో నిలుస్తున్న ఈయన ఇకపై ఇలాంటి వివాదాస్పద సినిమాలు చేయనని ఇటీవల ఓ సందర్భంలో తెలియ చేశారు. ఇక వర్మ ఎలాంటి ప్రాజెక్టులను ప్రకటించకపోయినా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ సినిమాలకు సంబంధించిన అంశాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి కూడా స్పందిస్తూ ఉంటారు.
అమితాబ్ బచ్చన్..
ఇదిలా ఉండగా తాజాగా వర్మ కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. అయితే ఈసారి మాత్రం ఈయన చాలా గట్టిగానే ప్లాన్ చేశారని స్పష్టమవుతుంది. ఈయన బాలీవుడ్ స్టార్ హీరోలైన అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), నానా పటేకర్ (Nanapatekar)వంటి వారితో సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఒక అద్భుతమైన కథను కూడా సిద్ధం చేశారని సమాచారం. ఇక ఈ సినిమాను పీవీపీ బ్యానర్ (PVP Banner)నిర్మించబోతోందని తెలుస్తోంది.. ఇలా వర్మ చాలా కాలం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమా చేయబోతున్నారనే విషయం తెలిసినా అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.
వివాదాస్పద సినిమాలు..
నిత్యం వివాదాస్పద సినిమాలు చేస్తూ వార్తలు నిలుస్తున్న వర్మ ఇక ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని చెప్పిన విధంగానే కాంట్రవర్సీ సినిమాలను పక్కనపెట్టి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సరికొత్త సినిమా ద్వారా రాబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కథ ఏంటి, ఈ సినిమాలో భాగమవుతున్న సెలబ్రిటీలు విషయాల గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ఇటీవల ఈయన చివరిగా ఏపీ రాజకీయ నాయకులకు సంబంధించిన సినిమాలను చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇలాంటి వివాదాస్పద సినిమా చేసినందుకు ఈయనపై కేసులు కూడా నమోదైన విషయం తెలిసిందే. ఇలా తనపై కేసు నమోదు కావడంతో ఇలాంటి సినిమాలు చేయనని వర్మ తెలియజేశారు.
Also Read: “జయమ్ము.. నిశ్చయమ్మురా”.. బుల్లితెర పైకి జగ్గు భాయ్ ఎంట్రీ!