Chris Gayle : వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్ (Chris Gayle) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెస్టిండిస్ తరపున కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా ఐపీఎల్ కెరీర్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. ఇక ఆ తరువాత చివర్లో పంజాబ్ కింగ్స్ కి కూడా ఆడి రిటైర్మెంట్ ప్రకటించేశాడు గేల్. గేల్ క్రీజులో ఉంటే.. సిక్సర్ల మోత మారుమ్రోగిపోవాల్సిందే. టీ-20 లో గేల్ పేరిట ఉన్న రికార్డులను ఇప్పటివరకు ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోవడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఓ వార్త వైరల్ అవుతోంది. ఇండియా బ్యాంకులో దోచుకున్నటువంటి వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, లలిత్ మోడీ లతో గేల్ రహస్యంగా వ్యాపారాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నట్టు సమాచారం.
Also Read : Shreyas Iyer Racing : క్రికెట్ కి గుడ్ బై.. రేసింగ్ రంగంలోకి సర్పంచ్ సాబ్.. జెర్సీ ఇచ్చి మరి
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాజీ యజమాని, పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా దాదాపు దశాబ్దం తరువాత తన మౌనాన్ని వీడారు. ఇటీవలే యూట్యూబర్ రాజ్ షమానీతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో నాలుగు రోజుల్లోనే యూట్యూబ్ లో 20 మిలియన్ల కి పైగా వ్యూస్ లభించాయి. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాజీ యజమాని విజయ్ మాల్యా 2013 నుంచి తన పతనం ప్రారంభమైందని వెల్లడించాడు. పలు సంఘటనల గురించి చర్చించడానికి దాదాపు 4 గంటలకు పైగా కూర్చున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోడీకి సుప్రీంకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ మారకద్రవ్యా నిర్వహణ చట్టం నిబంధన ఉల్లంఘన కేసులో ఈడీ తనకు రూ.10.65 కోట్లు జరిమానా విధించడాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేసారు. ఈ మొత్తాన్ని బీసీసీఐ చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్తానం తోసిపుచ్చింది.
గేల్, లలిత్ మోడీ, విజయ్ మాల్యా భేటీ.. వైరల్
అయితే ఆ చట్టం ప్రకారం.. తనను తాను రక్షించుకొనే హక్కు లలిత్ మోడీకి ఉందని.. న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, ఆర్. మహదేవన్ తో కూడిన సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. లలిత్ మోడీ డిసెంబర్ 19, 2023న ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తనను బీసీసీఐ ఉపాధ్యక్షుడుగా నియమించారని.. ఆ సమయంలో తాను ఐపీఎల్ చైర్మన్ గా కూడా ఉన్నానని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆయన వేసిన పిటిషన్ లో అర్థం లేదని.. ఫెమా కింద వ్యక్తిగతంగా ఆయనకు జరిమానా వేసినందున.. మొత్తం బీసీసీఐ చెల్లించాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంటూ ఈ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఐపీఎల్ లో లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోడీ 2010లో లండన్ కి పారిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ లలిత్ మోడీ, విజయ్ మాల్యా ఇద్దరినీ కలవడంలో ఆంతర్యమేమిటో అర్థం కాని పరిస్తితి నెలకొంది. ముఖ్యంగా ఆర్సీబీ తొలి ఓనర్ విజయ్ మాల్యా, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీలతో కలిసి వ్యాపారం చేస్తున్నాడా..? అనే ట్రోలింగ్స్ జరుగుతోంది.
Chris Gayle #chrisgayle pic.twitter.com/qHTAIoz59o
— RVCJ Sports (@RVCJ_Sports) July 1, 2025