E-Paper
Advertisement

‘డెకాయిట్’ మూవీ టికెట్ ధరలు భారీ తగ్గింపు.. ఎంతంటే?

‘డెకాయిట్’ మూవీ టికెట్ ధరలు భారీ తగ్గింపు.. ఎంతంటే?
Advertisement

Dacoit: అడివి శేష్ హీరోగా మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur)హీరోయిన్ల నటించిన తాజా చిత్రం డెకాయిట్(Decoit). ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న అడివి శేష్ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇకపోతే తాజాగా డెకాయిట్ సినిమా కూడా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అడివి శేష్ కెరియర్ లోనే ఎప్పుడు రాని విధంగా ఈ సినిమాకు 15 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టింది. ఇలా భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమాకు ఇప్పటికి కూడా కలెక్షన్లు పరంగా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. ఈ సినిమా థియేటర్ కి వచ్చి దాదాపు రెండు వారాలు పూర్తి అవుతున్న హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనం ఇస్తుంది.

భారీగా తగ్గిన డెకాయిట్ టికెట్ ధరలు..

ఇలా ప్రేక్షకుల నుంచి ఆదరణను సొంతం చేసుకున్న ఈ సినిమా విషయంలో చిత్ర బృందం అభిమానులకు ప్రేక్షకులకు శుభవార్తను తెలిపారు. ఈ సినిమా విడుదలకు ముందు టికెట్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలై 2 వారాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో సినిమా టికెట్ ధరలను తగ్గించారు. ఈ విషయాన్ని స్వయంగా అడివి శేష్ తెలిపారు. తెలంగాణలో ఈ సినిమా టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ థియేటర్ లో రూ.105 ,70 రూపాయల ధరలను నిర్ణయించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలోరూ.80, 50 రూపాయలుగా నిర్ణయించారు.

ఏప్రిల్ 24 నుంచి అందుబాటులోకి..

Advertisement

ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో మల్టీప్లెక్స్ లలో ఈ సినిమా టికెట్ ధరలు రూ.150 లుగా ఫిక్స్ చేశారు. తగ్గిన ధరలు ఏప్రిల్ 24వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని తెలియజేశారు. ఈ విధంగా డెకాయిట్ సినిమా ధరలు తగ్గడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా సినిమా టికెట్లు ధరలు తగ్గించడంతో ఈ సినిమాకు మరింత ప్రేక్షకాదరణ దక్కుతుందని చెప్పాలి. ఇక ఈ సినిమాకు షానిల్ డియో దర్శకత్వం వహించగా శేష్ మృణాళ్ ఠాకూర్ జంటగా నటించారు. ఇక ఈ సినిమాలో అనురాగ్ కస్యప్, ప్రకాష్ రాజ్, కామాక్షి భాస్కర్ల వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపించారు. ఇక ఈ సినిమాకు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించారు.

Advertisement

ఇటీవల కాలంలో శేష్ ఎన్నో విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మేజర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన ఇప్పుడు డెకాయిట్ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం శేష్ గూడచారి 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు ఇటీవల లిటిల్ హార్ట్ డైరెక్టర్ సాయి మార్తాండ్ తో మరో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే గూఢచారి పూర్తి అయిన తర్వాతనే ఈ సినిమా ఉంటుందని సాయి మార్తాండ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Also Read: నాపై ఉద్దేశపూర్వకంగానే కుట్రలు చేస్తున్నారు.. మంగ్లీ ఎమోషనల్ పోస్ట్!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×