Dhanush: ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ పూలబాటలు ఉంటాయి.. ముళ్ల దారులు ఉంటాయి. ప్రశంసలు వచ్చినప్పుడు సంతోషపడడమే కాదు.. విమర్శలు, రూమర్స్ వచ్చినప్పుడు తట్టుకొని నిలబడడం కూడా నేర్చుకోవాలి. ఒకప్పుడు రూమర్స్.. అడపాదడపా వచ్చేవి.వాటిని అప్పటితరం నటులు అంత పెద్దగా పట్టించుకోనేవారు కాదు. కానీ, ఇప్పటి స్టార్స్ అలా కాదు. కొంతమంది కావాలనే సోషల్ మీడియాలో తమ పేరును నలుగురిలో నానేలా చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వచ్చాకా.. సెలబ్రిటీలు ఎక్కడకు వెళ్లాలన్నా.. ఏది మాట్లాడలన్నా ఆచితూచి చేయాల్సి వస్తుంది. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా ట్రోలర్స్ ఏకిపారేస్తున్నారు.
తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరోసారి ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్.. ఐశ్వర్య రజినీకాంత్ తో విడాకులు తీసుకొని విడిపోయాక సింగిల్ గా ఉంటున్న విషయం తెల్సిందే. ఇప్పటికే చాలామంది హీరోయిన్లతో ధనుష్ ఎఫైర్ నడిపాడని, ఆ విషయం తెలియడంతోనే ఐశ్వర్య విడాకులు ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. అయినా కూడా ధనుష్ లో మార్పు రాలేదు. ఈమధ్యకాలంలో ధనుష్, సీనియర్ హీరోయిన్ మీనా పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే అందులో నిజం లేదని తరువాత తెల్సింది.
ఇక ఇప్పుడు ధనుష్.. స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య సీక్రెట్ రిలేషన్ నడుస్తుందని రూమర్స్ వస్తున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఈమధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ధనుష్- మృణాల్జంటగా కనిపిస్తున్నారు. మొన్నటికి మొన్న మృణాల్ పుట్టినరోజు వేడుకల్లో ధనుష్ నే సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా కనిపించాడు . ఆ వేడుక అయ్యేవరకు మృణాల్ పక్కనే ఉంటూ.. ఆమెతో ఎంతో సన్నిహితంగా కనిపించాడు. సడెన్ గా అక్కడ వారిద్దరిని చూసిన వారందరూ వీరి మధ్య కొత్త రిలేషన్ ఉందని గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు.
మృణాల్ బర్త్ డే వేడుకల్లో మాత్రమే కాదు .. ఈమధ్య ఈ చిన్నది ఎక్కడ ఉంటే ధనుష్ అక్కడ ఉంటున్నాడు. సార్ ఎక్కడ ఉంటే సీత కూడా అక్కడే కనిపిస్తుంది. మొన్నటికి మొన్న అసలు తనకు సంబంధం లేని ఒక పార్టీ ఈవెంట్ లో మృణాల్ సందడి చేసింది. అందుకు కారణం కూడా ధనుష్ అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో బాలీవుడ్ లో కొత్త ప్రేమ జంట వీరే అనే పుకార్లు షికార్లు చేయడం మొదలుపెట్టాయి. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం మృణాల్ కెరీర్ దెబ్బతిన్నట్లే అనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరి ప్రేమాయణం విని ఇదెక్కడి విడ్డూరం అబ్బా.. అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఒక్కో మెట్టు ఎక్కుతూ కెరీర్ ను బిల్డ్ చేసుకున్న మృణాల్.. చివరకు భార్యకు విడాకులు ఇచ్చిన స్టార్ హీరో ప్రేమలో పడుతుందా.. ? అంటే నమ్మశక్యంగా లేదు అనే మాటలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే మృణాల్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం తెలుగులో అమ్మడు డెకాయిట్ సినిమాలో నటిస్తోంది. ధనుష్ వరుసగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా మారాడు.