BigTV English

Mohammed Siraj : రికార్డు సృష్టించిన సిరాజ్.. ఆ సీనియర్ ఆటగాడి రికార్డు బ్రేక్..!

Mohammed Siraj : రికార్డు సృష్టించిన సిరాజ్.. ఆ సీనియర్ ఆటగాడి రికార్డు బ్రేక్..!

Mohammed Siraj : ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్  2-2 తో సమానం అయింది. ఈ సిరీస్ ను ఇంగ్లాండ్ జట్టు కైవసం చేసుకుంటుందని చివరి వరకు అంతా అనుకున్నారు. నిన్న 35 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో మ్యాచ్ ని ముగించారు. అప్పటికీ 6 వికెట్లు ఉన్నాయి. కానీ ఇంగ్లాండ్ జట్టు ఇవాళ వరుసగా వికెట్లను కోల్పోయింది. ముఖ్యంగా టీమిండియా బౌలర్లు సిరాజ్, ప్రసిద్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా ని విజయం వరించింది. మరోవైపు కొన్ని క్యాచ్ లు, ఫీల్డింగ్ లో కూడా పొరపాట్లు చేసింది టీమిండియా.. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి టీమిండియా విజయం సాధించింది.


Also Read : ICC WTC Points Table : 5వ టెస్ట్ విన్… WTC పాయింట్స్ టేబుల్ లో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..?

సిరాజ్ బౌలింగ్ అదుర్స్ 


ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా స్టార్ పెసర్ మహ్మద్ సిరాజ్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. తన సంచలన బౌలింగ్ తో భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో సిరాజ్ 5 వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా తొమ్మిది వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ క్రమంలో సిరాజ్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ గా సిరాజ్ నిలిచాడు. సిరాజ్ ఇప్పటి వరకు ఇంగ్లాండులో 46 టెస్టు వికెట్లు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉండేది. కపిల్ దేవ్ తన టెస్టు కెరీర్ లో ఇంగ్లాండ్ గడ్డపై 43 వికెట్లు సాధించాడు. తాజా ఇన్నింగ్స్ లో స్మిత్ ను అవుట్ చేసి ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

బుమ్రా రికార్డు సమం.. 

ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో జస్ప్రీత్ బుమ్రా(51), ఇశాంత్ శర్మ (51) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. అదే విధంగా ఇంగ్లాండ్ లో జరిగిన ఒక టెస్టు సిరీస్ లో భారత్ తరపున అత్యధిక వికెట్లు (23) తీసిన బౌలర్ గా బుమ్రా రికార్డును సిరాజ్ సమం చేశాడు. బుమ్రా 2021-2022 పర్యటనలో ఇంగ్లాండు పై 23 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో సిరాజ్ మరో వికెట్ తీసి ఉంటే బుమ్రాను అధిగమించేవాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ హిస్టరీలో అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన నాలుగో బౌలర్ గా అక్షర్ పటేల్ రికార్డును సిరాజ్ సమం చేశాడు. ఇప్పటివరకు ఐదు సార్లు 5 వికెట్ల ఘనత సాధించగా, సిరాజ్ కూడా సరిగ్గా ఐదుసార్లు ఈ ఫీట్ సాధించాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బూమ్రా (12) అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత అశ్విన్ (11), రవీంద్ర జడేజా (6), జడేజా కొనసాగుతున్నారు. ఇక ఈ సిరీస్ లో సిరాజ్ (23 వికెట్లు) లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు.

Related News

IND Vs PAK : నేడు పాకిస్తాన్ వ‌ర్సెస్ టీమిండియా మ్యాచ్.. “నో షేక్ హ్యాండ్” త‌రువాత మ‌రో స‌మ‌రం

SL Vs BAN : శ్రీలంక కి షాక్.. సూప‌ర్ 4 తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజ‌యం

Smriti Mandhana : విరాట్ కోహ్లీ 12 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన స్మృతి మంధాన..

SL Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. తొలుత బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : ఫాస్టెస్ట్ సెంచరీ.. రికార్డు సృష్టించిన మంధాన

Abhishek Sharma : టీమిండియాలో మరో జయసూర్య.. వీడు కొడితే నరకమే

Asia Cup 2025 : టీమిండియా నుంచి గిల్ ను తొలగించండి… ఆడుకుంటున్న ఫ్యాన్స్

Ind vs aus : కొత్త జెర్సీలో టీమిండియా..రెచ్చిపోయిన ఆసీస్‌.. తొలిసారిగా 400పైగా స్కోర్

Big Stories

×