Teja Sajja: తేజ సజ్జ (Teja Sajja)ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు. బాల నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన తేజ సజ్జ హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. తేజ హీరోగా నటించిన జాంబిరెడ్డి, హనుమాన్ వంటి సినిమాలు ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈయన కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వంలో మిరాయ్ (Mirai)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలు నడుమ విడుదలైన ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతుంది.
ఇక ఈ సినిమా కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా భారీగా కలెక్షన్లను రాబడుతుంది. తాజాగా నార్త్ అమెరికాలో మిరాయ్ సినిమా ఏకంగా 2.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లను రాబట్టడంతో సంచలనంగా మారింది. అయితే నార్త్ అమెరికాలో ఈ విధమైనటువంటి రికార్డు సాధించిన తెలుగు హీరోలలో తేజ సజ్జ మూడో హీరోగా ఉండటం విశేషం. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా నార్త్ అమెరికాలో ఇలాంటి హిట్ అందుకున్న హీరోలలో ఎన్టీఆర్(NTR), ప్రభాస్(Prabhas) తరువాతి స్థానంలో తేజ సజ్జ నిలిచారు. ఇదివరకు తేజ నటించిన హనుమాన్(Hanuman) సినిమా కూడా నార్త్ అమెరికాలో 2.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లను రాబట్టింది. హనుమాన్ తర్వాత మిరాయ్ సినిమా కూడా అదే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పాన్ ఇండియా హీరోలకు పోటీ..
ప్రభాస్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ హీరోలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా పాన్ ఇండియా హీరోల సినిమాలు నార్త్ అమెరికాలో మంచి కలెక్షన్లను రాబట్టాయి అంటే పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు కానీ, టైర్ 2 హీరోగా తక్కువ బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న తేజ ఇప్పుడు ఓవర్సీస్ లో తన సినిమాల ద్వారా ఈ తరహా కలెక్షన్లను రాబట్టడం విశేషం. ఈ సినిమా విడుదలయ్యి పది రోజులు అవుతున్న ఇప్పటికీ అదే స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతుంది.
తన నటనతో అదరగొట్టిన మనోజ్…
ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ పాత్ర కూడా అద్భుతంగా ఉన్న సంగతి తెలిసిందే. విలన్ గా మంచు మనోజ్(Manchu Manoj) తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా చూసిన ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం కూడా ఉండబోతుందని చిత్ర బృందం వెల్లడించారు.