Pawan Kalyan Movies: ఏంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరిన్నీ సినిమాలు చేస్తున్నారా? అని ఆశ్చర్యపోతున్నారా ? అవును.. మీరు ఆశ్చర్యపోయినా… ఇది నిజమే అని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తుంది. డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తూనే సినిమాలు చేయాలని పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయానికి వచ్చారట. అందులో భాగంగానే, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన కోసం కథలు రెడీ చేస్తున్నారని సమాచారం. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం… పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించారు. ఆయన ఒప్పుకున్న సినిమాలను కూడా అతి కష్టమీద రిలీజ్ చేస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ తో బిజీ
ఇటీవలే హరి హర వీరమల్లు అనే సినిమాను అసంపూర్ణంగా షూట్ చేసి, అదో అలా రిలీజ్ చేశారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయిపోయింది. అలాగే, ఓజీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నారు దాన్ని. అలాగే, ఎప్పుడో 5 నుంచి 6 ఏళ్ల కిందట సైన్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. దీనికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయరని అందరూ అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఓ సందర్భంలో యాక్టింగ్ చేయడం కంటే, సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నానని చెప్పుకొచ్చాడు. దీనికే అందరూ ఫిక్స్ అయిపోయారు.
త్రివిక్రమ్ తో సినిమా
కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలను ప్రొడ్యూస్ చేయడంతో పాటు హీరోగా యాక్టింగ్ చేయడానికి కూడా సుముకంగా ఉన్నారని సమాచారం. ఈయన నిర్మాత రత్నంగా ఓ సినిమా చేసి పెడుతానని మాట ఇచ్చారట. హరి హర వీరమల్లు మూవీ డిజాస్టర్ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారట. తక్కువ బడ్జెట్‌లో త్వరగా సినిమా పూర్తి అయ్యేలా కథ ఎంచుకునే ఆలోచనలో ఉన్నారట. ఇది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. పవన్ కళ్యాణ్ కు సినిమాలను సెట్ చేసే పనిలో ఉన్నారట.
ఇప్పటికే రెండు కథలను ఫైనల్ చేసి, పవన్ కళ్యాణ్ కోసం రెడీగా పెట్టారట. వాటి గురించి త్వరలోనే పవన్ తో చర్చించి ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. అయితే, వీటికి డైరెక్టర్ గా త్రివిక్రమ్ కాకుండా, టాలీవుడ్ లోనే మరో డైరెక్టర్ తో చేయిస్తారని సమాచారం. అందులో ఒకటి, సముధ్రఖని దర్శకత్వలో, రత్నం నిర్మాణంలో ఉండొచ్చనే టాక్ వస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ తో సముద్రఖని చేసిన బ్రో మూవీని సెట్ చేసింది కూడా త్రివిక్రమే. ఆ సన్నిహిత్యం వారి మధ్య ఉంది. అందుకే ఇప్పుడు కూడా వీరి కాంబో, త్రివిక్రమ్ వల్ల సెట్ అవుతుందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది.