Tourist Tax: థాయ్‌లాండ్.. ఈ మధ్య ఇండియన్స్ హాలిడే డెస్టినేషన్‌గా మారింది. చాలా మంది భారతీయులు.. థాయ్‌లాండ్‌కు క్యూ కడుతున్నారు. నాట్ ఓన్లీ ఇండియన్స్.. చాలా దేశాల నుంచి హాలిడేస్‌ను ఎంజాయ్ చేసేందుకు లక్షల సంఖ్యలో థాయ్‌లాండ్‌కు వస్తుంటారు టూరిస్టులు. అయితే ఇప్పుడు వారి నుంచి టూరిస్ట్ ట్యాక్స్ వసూలు చేసే ఆలోచనలో ఉంది అక్కడి ప్రభుత్వం. ఒక్కొకరి నుంచి 300 బాట్‌లు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ట్రావెల్ ఏజెన్సీలకు ఈ విషయంపై అవగాహన కల్పిస్తోంది. టూరిస్టులకు ఈ ట్యాక్స్ గురించి అవగాహన పెంచాలని సూచిస్తోంది అక్కడి ప్రభుత్వం.
సోషల్ మీడియాలో నెటిజన్లు అసంతృప్తి
థాయ్‌లాండ్‌కు వచ్చే టూరిస్టుల భద్రతా ఇంకా టూరిస్ట్ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఈ ట్యాక్స్ చాలా ముఖ్యం అంటున్నారు అక్కడి ప్రభుత్వ పెద్దలు. ఈ ప్రభావం ఎక్కువగా టూరిస్టులపై పడదనే నమ్మకం ఉందంటున్నారు. అయితే థాయ్‌లాండ్ తీసుకునే ఈ నిర్ణయంపై ఇప్పటికే సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు టూరిస్టులు. నిజానికి ఈ ఆలోచన ఇప్పటిది కాదు. 2020లోనే ఇలాంటి ట్యాక్స్ వసూలు చేయాలని థాయ్‌లాండ్ పాలకులు సూచన చేశారు.
ALSO READ: Sub Inspector: డిగ్రీ అర్హతతో 2861 ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్.. అక్షరాల రూ.1,12,400 జీతం
2023 ఫిబ్రవరిలోనే ఈ నిర్ణయం..
అయితే చాలా ఏళ్ల చర్చ తర్వాత 2023 ఫిబ్రవరిలో ఈ నిర్ణయానికి థాయ్‌లాండ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత కూడా ఈ నిర్ణయం అమల్లోకి రాలేదు. మళ్లీ ఇన్నేళ్లకు ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈసారి ఎలాగైనా ఈ ట్యాక్స్ వసూలు నిర్ణయాన్ని అమల్లోకి తేవాలని ఆలోచనలో ఉంది థాయ్‌లాండ్ ప్రభుత్వం. అయితే ఎయిర్ ట్రావెల్ చేసి వచ్చే వారిపై 300 బాట్‌లు.. నార్మల్‌గా వచ్చే వారిపై 150 బాట్‌లు వసూలు చేసే ఆలోచనలో ఉంది థాయ్‌లాండ్ ప్రభుత్వం. కానీ ఇంత వరకు తుది నిర్ణయాన్ని అయితే తీసుకోలేదు.
ALSO READ: Farmer Scheme: వ్యవసాయ భూమి ఉంటే చాలు.. ఈజీగా రూ.50వేలు పొందవచ్చు.. అప్లికేషన్ విధానం ఇదే..
300 బాట్‌లు అంటే రూ.900
300 బాట్‌లు అంటే ఇండియన్ కరెన్సీలో 800 నుంచి 900 రూపాయల మధ్యలో ఉంటుంది. చూసేందుకు ఈ అమౌంట్ చాలా తక్కువగానే కనిపిస్తున్నా.. ఓవరాల్‌గా చూస్తే ఇది థాయ్‌లాండ్ ప్రభుత్వానికి భారీగానే ఆదాయాన్ని ఇస్తోంది. ఎందుకంటే ప్రతి ఏడాది థాయ్‌లాండ్‌కు వెళ్లే ఇండియన్స్ సంఖ్యే 20 లక్షలకు పైగా ఉంటుంది. 2023తో పోలిస్తే ఏకంగా 30 శాతం టూరిస్టుల సంఖ్య పెరిగింది. మరి ఈ ట్యాక్స్‌ను ఎలా వసూలు చేస్తారనే దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. టికెట్ కొనేప్పుడే ఈ ట్యాక్స్‌ను వసూలు చేస్తారా? లేదా ఇమ్మిగ్రేషన్ సమయంలో వసూలు చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.