Ram Charan: చిరుత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తన స్టామినా ఏంటో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చూపించాడు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు ఎలా నటిస్తాడు అని చాలామంది క్యూరియాసిటీతో ఎదురు చూశారు. ఒక్కసారి స్క్రీన్ పైన రామ్ చరణ్ చూసిన తర్వాత అందరికీ మంచి ఉపశమనం కలిగింది. ఇది కదా మెగాస్టార్ చిరంజీవి నట వారసత్వం అంటే అనిపించుకున్నాడు.
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేసిన మగధీర సినిమా ఎంతటి స్థాయి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా సాధించిన ఘనత మామూలుది కాదు. అప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా ఆ సినిమా కొల్లగొట్టింది.
మళ్లీ బుచ్చి గురువుతోనే
రామ్ చరణ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆయన జీవితంలో ప్రత్యేకమైన సినిమా అంటే రంగస్థలం. రామ్ చరణ్ లోని కంప్లీట్ నటుడిని బయటికి తీసిన సినిమా రంగస్థలం. ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అని అందరినీ ఆశ్చర్యపరిచాడు. రామ్ చరణ్ మాత్రమే కాకుండా సుకుమార్ లోని కొత్త దర్శకుడు ఆ సినిమాతో బయటకు వచ్చాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడటానికి చాలామంది మళ్ళీ ఎదురుచూస్తున్నారు. ఇదివరకే మీరు కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్టు అనౌన్స్ కూడా చేశారు. ప్రస్తుతం బుచ్చిబాబుతో సినిమా అయిపోయిన వెంటనే,సుకుమార్ తో సినిమా ఉంటుంది. సుక్కు దగ్గర ఆల్రెడీ పాయింట్ లాక్ అయ్యింది,30 నిమిషాల నేరేషన్ ఫైనల్ అయ్యింది. USA,UK లో వెకేషన్ చూసుకుంటూనే డిస్కషన్స్ లో పాల్గొంటున్నారు. ఇక్కడికి దిగేటప్పటికీ ఒక వెర్షన్ రెడీ అవుతుంది
సరైన హిట్ పడాలి
ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే రంగస్థలం సినిమా తర్వాత వినయ విధేయ రామ సినిమా అనుకున్న సక్సెస్ సాధించకపోయిన కూడా, ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న పెద్ది సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన వీడియో కూడా మంచి నమ్మకాన్ని క్రియేట్ చేసింది. పెద్ది సినిమాలో రామ్ చరణ్ తేజ్ ఉత్తరాంధ్ర యాసను మాట్లాడనున్నారు. ఇదివరకే గోదావరి యాసతో ఆకట్టుకున్న చరణ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో అని క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది. ఏదేమైనా మొత్తానికి గురు శిష్యులు రామ్ చరణ్ తేజ్ కు పోటాపోటీగా హిట్స్ అందించనున్నారు.