Nuvvu Naku Nachav Re release: విక్టరీ వెంకటేష్(Venkatesh), ఆర్తి అగర్వాల్(Arthi Agarwal) హీరో హీరోయిన్లుగా, కే విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నువ్వు నాకు నచ్చావ్(Nuvvu Naku Nachav). 2001వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలలో ప్రసారమైన అభిమానులు కళ్లార్పకుండా చూస్తారు. ఈ విధంగా థియేటర్లలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా మరోసారి థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలా రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలోనే మరోసారి నువ్వు నాకు నచ్చావ్ సినిమాని తిరిగి విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమాని 4K వర్షన్ లో విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. కేవలం మన తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాని చాలా గ్రాండ్ గా రీ రిలీజ్ చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా స్రవంతి మూవీస్ బ్యానర్ వారు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది అనగా జనవరి 1, 2026 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక ఈ అద్భుతమైన సూపర్ హిట్ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కథ అందించిన సంగతి తెలిసిందే. ఇలా త్రివిక్రమ్, వెంకటేష్ అభిమానుల కోసం మరోసారి ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి అయితే ఈ సినిమాలకు త్రివిక్రమ్ కథా రచయితగా పనిచేయటం విశేషం వాసు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ కథ అందించారు. ఇక మొదటిసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ నటించబోతున్న సంగతి తెలిసిందే.
సంక్రాంతికి వస్తున్నాం..
ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా పూజా కార్యక్రమాలను ఎంతో ఘనంగా జరుపుకుంది అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాకు వెంకటరమణ అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి కానీ ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ప్రస్తుతం ఈ సినిమా వెంకీ 77 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం సినిమా తర్వాత తిరిగి వెంకటేష్ తో సినిమా చేయబోతున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఇక వెంకటేష్ కూడా చివరిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
Also Read: Actress Trisha: వ్యాపారవేత్తతో పెళ్లి… తెరపైకి మళ్లీ త్రిష పెళ్లి వార్తలు?