E-Paper
Advertisement

సుమను ఇరికించిన ప్రజ్వల్.. ఇంటర్వ్యూలో నవ్వులే నవ్వులు!

సుమను ఇరికించిన ప్రజ్వల్.. ఇంటర్వ్యూలో నవ్వులే నవ్వులు!
Advertisement

AK47 Interview:సినిమా ఈవెంట్లు అయినా, ఇంటర్వ్యూలు అయినా యాంకర్ సుమ ఉంటే అక్కడ నవ్వుల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు,ఇక తాజాగా ‘AK47’ సినిమా ఇంటర్వ్యూలో కూడా సుమ ఎప్పటిలాగే తన పంచ్‌లతో తెగ సందడి చేసింది.ఇక ఈ ఇంటర్వ్యూలో చైల్డ్ ఆర్టిస్ట్ ప్రజ్వల్ చెప్పిన కవిత్వం, లెక్కల మాస్టర్‌ క్లాస్ అక్కడున్న వారి పొట్టలు చెక్కలు చేశాయి .

ఇంటర్వ్యూ మొదట్లోనే ప్రజ్వల్‌ను సుమ గురించి చెప్పమని అడగగా ఒక్కసారిగా ఆ కుర్రాడు కవి అయిపోయాడు. ‘‘అందాల సుకుమారి, స్వర్ణ సుందరి.. ఆమెను చూస్తే అందరి గుండె జారి.. గుండెల్ని చేస్తుంది చోరీ’’ అంటూ సుమను ఆకాశానికి ఎత్తేశాడు. దీంతో అక్కడున్నవారంతా పగలబడి నవ్వుకున్నారు.

Advertisement

అయితే ఈ లైన్లు కొత్తవి కాదని, సెట్లో కూడా ఇంతే చెప్పాడని అతన్ని ఆటపట్టించారంతా.ఇ అసలు ప్రజ్వల్ తన్ను ‘అక్క’ అని పిలవకుండా ‘సుమ గారు’ అంటున్నాడని సుమ చెప్పడం మరింత నవ్వు తెప్పించిందనే చెప్పాలి.

ఇక ఈ ఇంటర్వ్యూలో ప్రజ్వల్‌కు మ్యాథ్స్ బాగా వస్తుందని తెలిసి సుమ అతనికి లెక్కలు వేయడం మొదలుపెట్టింది. అయితే ఆ లెక్కలకి పెద్దలు కూడా సమాధానాలు చెప్పకపోవడం మరింత నవ్వుల వర్షం కురిపించింది.
ఇక వెంకటేష్ చిన్నప్పుడు ఎలా చదువుకునేవారంటూ సరదాగా నవ్వులు పూయించారు. చిన్న పిల్లాడి టాలెంట్ చూద్దామనుకున్న పెద్దలకే ఆ లెక్కల పరీక్ష పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పాలి.

Advertisement

ఇక సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుతూ చిన్నబాబు ఎలా ఖర్చు పెడతారనే దానిపై కూడా ఇంటర్వ్యూలో కామెడీ జనరేట్ అయ్యింది.ఇక చాలాసేపటి నుంచి సైలెంట్‌గా కూర్చున్న నారా రోహిత్ మీద కూడా సుమ పంచ్ లు వేయడం విశేషం. అయితే షూటింగ్ సెట్స్‌లో కూడా ఇంతే సైలెంట్‌గా ఉంటారా అని అడిగగా ,కొందరైతే 41 రోజుల మాల వేసుకున్నప్పుడే అంత ప్రశాంతంగా ఉంటారని, కానీ నారా రోహిత్ మాత్రం ఏడాదంతా ఇలాగే ఉంటాడని సరదాగా కామెంట్లు చేశారంతా . ఇక ఆయనకు ఎలాంటి మాల అవసరం లేదని, ఆయనే న్యాచురల్ గా కూల్ అంటూ నవ్వులు పూయించారంతా .

మొత్తానికి ‘AK47’ ఇంటర్వ్యూ సినిమా విశేషాల కంటే ఫుల్ కామెడీతో సాగిపోయిందని చెప్పాలి. ప్రజ్వల్ కవిత్వం, నారా రోహిత్ సైలెన్స్, సుమ టైమింగ్ ఇవన్నీ కలిసి ఈ ఇంటర్వ్యూను ఫుల్ ఎంటర్ టైనింగ్ గా మార్చేశాయి.చూడాలి మరి భారీ అంచనాలతో ఈ నెల 30న రాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !

also read:అన్యా సింగ్‌కు ఎల్లే ఇండియా నుంచి స్పెషల్ ట్రీట్.. ఫుల్ ఖుషీలో బ్యూటీ!

Tags

Related News

పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న వేళ.. చిరంజీవితో ఇద్దరు మాస్టర్లు!

అన్యా సింగ్‌కు ఎల్లే ఇండియా నుంచి స్పెషల్ ట్రీట్.. ఫుల్ ఖుషీలో బ్యూటీ!

ఆ సినిమాను కొనేవాళ్లే లేరా? రిలీజ్‌కు ముందే రూ.15 కోట్ల నష్టం?

సంక్రాంతి వరకు సినిమాల జాతరే.. ప్రతి వారం కొత్త సినిమాల దండయాత్ర!

విశ్వక్ సేన్ కల్ట్‌లో రక్తపాతమే హైలైటా?

మాస్ బాలయ్యతో ఇరుముడి డైరెక్టర్ ..ఈ కాంబో సెట్ అవుతుందా?

కిల్లర్ సినిమాపై ట్రోలింగ్ చేస్తున్నవాళ్లకు పూర్వజ్ స్ట్రాంగ్ ఆన్సర్!

Big Stories

Advertisement
×