Balakrishna-Shiva Nirvana Movie:శివ నిర్వాణ..ఇరుముడి వంటి డివైన్ హిట్ కి దర్శకత్వం వహించిన ఈ యంగ్ డైరెక్టర్ ఇపుడు బాలయ్యతో సినిమా చేయబోతున్నాడా అంటే అవుననే వినిపిస్తుంది. ప్రస్తుతం బాలయ్య మైసూరులో ‘దాదా’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. అక్కడ షూటింగ్ గ్యాప్‌లో దర్శకుడు శివ నిర్వాణ బాలకృష్ణను కలసి ఒక కథా లైన్ వినిపించారని టాక్ నడుస్తోంది. శివ నిర్వాణ చెప్పిన ఆ కాన్సెప్ట్ బాలయ్యకు బాగా నచ్చిందని, దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా నడుస్తున్నాయి.
ఇక బాలకృష్ణ కెరీర్ విషయానికి వస్తే ఎప్పుడూ రొటీన్ సినిమాలు చేయకుండా, మాస్ యాక్షన్ జానర్స్ లలో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తున్న సంగతి తెల్సిందే.ఇక ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే కథలపై కూడా ఫోకస్ పెట్టె బాలయ్య ఎలాంటి సినిమాలు చేస్తాడా అన్న క్యూరియాసిటీ ఆయన అభిమానుల్లో కనిపిస్తుంది కూడా.
అలాంటిది శివ నిర్వాణ లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తీసే దర్శకుడితో బాలయ్య కలసి పనిచేస్తే ఎలా ఉంటుందా అంటూ ఇప్పటి నుండే ఆరాలు తీయడం మొదలెట్టారు అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, శివ నిర్వాణ ప్రస్తుతం ఒక లైన్ మాత్రమే చెప్పారని, పూర్తి స్థాయిలో స్టోరీని ఇంకా వినిపించాల్సి ఉందని సమాచారం.
ఇక శివ నిర్వాణ విషయానికి వస్తే, లవ్ స్టోరీస్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ ని తెరపై బ్యూటిఫుల్ గా చూపించడంలో ఆరితేరిపోయాడనే చెప్పాలి. ‘నిన్ను కోరి’ సినిమాతో దర్శకుడిగా జర్నీ మొదలుపెట్టిన ఆయన, ‘మజిలీ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు.
నాగచైతన్య, సమంత జంటగా వచ్చిన ఆ సినిమా ప్రేమ, పెళ్లి తర్వాత వచ్చే సమస్యలని బాగా చూపించింది.ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ, సమంతలతో ‘ఖుషి’ సినిమా చేసి మరోసారి తన మార్కు చూపించాడు శివ నిర్వాణ.
అలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమాలు తీసే దర్శకుడు, బాలకృష్ణ లాంటి పవర్‌ఫుల్ మాస్ హీరో కోసం కథ సిద్ధం చేస్తున్నారంటే క్యూరియాసిటీ కలగడం చాలా సహజం.ఇక బాలయ్య అనగానే మనకు గుర్తుకువచ్చేవి పవర్‌ఫుల్ డైలాగులు, ఊరమాస్ యాక్షన్ సీన్లని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.సో ఇలా రెండు వేర్వేరు జానర్స్ లో సినిమాలు తీసే వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే మరో డిఫరెంట్ క్రేజీ ఎంటర్ టైనర్ రావడం పక్కా అని చెప్పక్కర్లేదు.
అయితే మైసూరులో స్టోరీ లైన్ విన్న బాలయ్య,హైదరాబాద్ వచ్చిన తర్వాత పూర్తి కథను వింటానని చెప్పారని టాక్ నడుస్తుంది.మరి ఆ ఫుల్ నేరేషన్ పూర్తయ్యాకే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందా లేదా అనేదానిపై ఒక క్లారిటీ వచ్చేలా కనిపిస్తుంది.
ఏది ఏమైనా వీరిద్దరి కాంబినేషన్ నిజంగా కుదిరితే మాత్రం టాలీవుడ్‌లో అది ఒక క్రేజీ కాంబినేషన్ అని చెప్పక తప్పదు.అయితే ఈ వార్తలపై ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు కాబట్టి రూమర్స్ గానే పరిగణించాలి !
ALSO READ :కిల్లర్ సినిమాపై ట్రోలింగ్ చేస్తున్నవాళ్లకు పూర్వజ్ స్ట్రాంగ్ ఆన్సర్!