Telugu Movie Releases:అక్టోబర్ నుండే చూస్తే ఈ30న ‘AK47’, విశ్వక్ సేన్ దర్శకత్వంలో వస్తున్న ‘కల్ట్’, మరియు ‘కిల్లర్’ సినిమాలు విడుదలయ్యేందుకు రెడీ అయ్యాయి .ఇక ఇప్పటికే ఈ సినిమాలపై ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది కూడా. ఆ వెంటనే నవంబర్ 5, 6 తేదీల్లో ‘రామాయణ’, ‘సీన్’, ‘సమ్మర్ హాలిడేస్’, ‘మహాశక్తి’ వంటి సరికొత్త సినిమాలు బాక్సాఫీస్ పై ఎటాక్ చేయబోతున్నాయి.
నవంబర్ లో చూస్తే
ఇక నవంబర్ లో చూస్తే ఈ పోటీ కాస్త గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తుంది. నవంబర్ 12, 13 తేదీలలో ‘భోగి’, ‘దొంగ నా కొడుకు’, ‘ఇట్లు అర్జున’, ‘డార్క్ చాక్లెట్’, ‘చంద్రయాన్’, ‘హతః’, ‘మాయ లేడీ’, ‘టాల్కమ్ పౌడర్’ వంటి ఏడెనిమిది సినిమాలు ఒక్కసారిగా విడుదలకు రెడీ అవ్వడం విశేషం.మరి ఈ సినిమాలు అలాగే డేట్ మీద ఉంటాయా లేక మాట మార్చుకుంటాయ చూడాలి.
అయితే ఇన్ని సినిమాలు ఒకేసారి వస్తే థియేటర్లు దొరకడం, బాక్సాఫీస్ దగ్గర నిలబడటం మాత్రం కాస్త కష్టమే.ఆ తర్వాత వీక్ చూస్తే నవంబర్ 19, 20 తేదీల్లో ‘ENE రిపీట్’, ‘AOT’, ‘OM’, ‘సత్యవాన్ సావిత్రి’, ‘రాయవలస’ సినిమాలు విడుదలవుతుండగా, నవంబర్ 27న ‘హైందవ’, ‘మైసా’, ‘హై’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
డిసెంబర్ నెల కూడా సినిమాలతో బిజీబిజీ
ఇక డిసెంబర్ నెల కూడా సినిమాలతో బిజీబిజీగా ఉండనుంది అండోయ్. డిసెంబర్ 4న ‘వృషకర్మ’, ‘అలియాస్ రుక్మిణి’, ‘లెగసీ’, ‘ట్రైన్’ వంటి చిత్రాలు రిలీజ్ కానుండగా, డిసెంబర్ 11న ‘ఇడుపు కాయితం’, ‘భూతం ప్రేతం’ అనే థ్రిల్లర్, హారర్ సినిమాలు ఎటాక్ చేయబోతున్నాయి.
ఇక హాలీవుడ్ మూవీ లవర్స్ కోసం డిసెంబర్ 17, 18 తేదీల్లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’, ‘డ్యూన్ 3’ సినిమాలు వరల్డ్ వైడ్ గా వచ్చేందుకు రెడీ అవడం విశేషం.ఇక డిసెంబర్ 24, 25 క్రిస్మస్ పండుగ కానుకగా ‘దాదా’, ‘కింగ్ 100’, ‘కింగ్’, ‘రియాలిటీ’లతో పాటు హాలీవుడ్ క్రేజీ మూవీ ‘జుమాంజీ 3’ థియేటర్లను సందడి చేయనుండటం తో ఇప్పటి నుండే రెడీ అయిపోతున్నారు మూవీ లవర్స్.
సంక్రాంతి సీజన్ కూడా హాట్ హాట్
ఇక 2026 ని పక్కన పెడితే 2027 సంక్రాంతి సీజన్ కూడా హాట్ హాట్ గానే కనిపిస్తుంది. జనవరి 8న ‘మహాకాళి’ విడుదలతో మొదలై, పండుగ రోజుల్లో అంటే జనవరి 12, 13, 14 తేదీలలో ‘J12V’, ‘SYG’, ‘కాకా’, ‘జార్జ్ క్రిష్’, ‘ఫ్యామిలీ ప్యాక్’ వంటి సినిమాలు పోటీ పడబోతున్నాయి.అయితే ఒక్కటే వారంలో ఇన్ని సినిమాలు వస్తున్నప్పుడు థియేటర్లు ఎలా దక్కించుకుంటారు అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా కంటెంట్ బాగుంటేనే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవుతాయని చెప్పక్కర్లేదు. చూడాలి మరి ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !
ALSO READ :విశ్వక్ సేన్ కల్ట్‌లో రక్తపాతమే హైలైటా?