E-Paper
Advertisement

అన్యా సింగ్‌కు ఎల్లే ఇండియా నుంచి స్పెషల్ ట్రీట్.. ఫుల్ ఖుషీలో బ్యూటీ!

అన్యా సింగ్‌కు ఎల్లే ఇండియా నుంచి స్పెషల్ ట్రీట్.. ఫుల్ ఖుషీలో బ్యూటీ!
Advertisement

Anya Singh:బాలీవుడ్ బ్యూటీ అన్యా సింగ్‌కు అరుదైన గౌరవం దక్కిందండోయ్ . అవును ..ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ఎల్లే ఇండియా నుంచి ఆమెకు స్పెషల్ రికక్నైజేషన్ లభించింది మరి.ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, ఈ గుడ్‌న్యూస్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసుకోవడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్ .

ఎల్లే ఇండియా తాజాగా బ్యూటీ స్పాట్‌లైట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించగా ఇందులో భాగంగా అన్యా సింగ్‌కు ‘ఎల్లే బ్యూటీ స్పాట్‌లైట్ స్టార్ ఫిమేల్’ అవార్డు దక్కింది.ఇక ఇదే విషయాన్ని సంతోషంగా తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ . తనకు ఈ గౌరవం దక్కడం చాలా స్పెషల్ అని అంతేకాకుండా ఈ గుర్తింపునిచ్చిన ఎల్లే ఇండియా టీమ్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్ అంటూ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

సినిమా స్టార్స్ విషయానికి వస్తే కేవలం సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా, ఫ్యాషన్ మరియు స్టైల్ పరంగా వచ్చే గుర్తింపులు మరింత ఎనర్జీ ఇస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఇపుడు అన్యా సింగ్‌కు దక్కిన ఈ గుర్తింపు కూడా అలాంటిదే అని చెప్పుకోవాలి. ఇక ఆమె పడిన కష్టానికి, స్టైలిష్ లుక్స్‌కు తగిన గుర్తింపు లభించిందని కామెంట్ల కురిపిస్తున్నారు ఫాలోవర్స్. సెలబ్రిటీల జీవితంలో ఇలాంటి అవార్డులు కేవలం రివార్డులతో ఆగిపోవు. వారి కెరీర్ జర్నీని, ఫ్యాషన్ సెన్స్‌ను మరో లెవల్‌కి తీసుకెళ్తాయి. అందుకే అన్యా సింగ్ షేర్ చేసిన ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అన్యా సింగ్ విషయానికి వస్తే.. ఆమె నటనతోనే కాకుండా ఇలా ఆమె షేర్ చేసే ఫొటోషూట్స్, ఈవెంట్ లుక్స్ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయని చెప్పక్కర్లేదు.నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ అనేది సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య ఒక బిడ్జిలా అయిపొయింది.స్టార్స్ ప్రతీ హ్యాపీ మూమెంట్స్, సినిమా అప్‌డేట్స్ అన్నీ ఇక్కడే షేర్ చేసుకుంటున్నారు మరి.

Advertisement

ఇక అన్యా సింగ్ సినీ జర్నీ విషయానికి వస్తే హిందీ సినిమా, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు అందుకుంటున్న ఈ భామ ‘నెవర్ కిస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్’ వంటి వెబ్ సిరీస్‌లతో డిజిటల్ ఆడియన్స్ కి దగ్గరైపోయింది.అలాగే జీ కర్దా వంటి ప్రాజెక్టులతోనూ మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ కెరీర్ లో మరింత దూసుకుపోవాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

ఫ్యాషన్ వరల్డ్‌లో ఎల్లే ఇండియా విషయానికి వస్తే ఈ మ్యాగజైన్ ఇచ్చే రికగ్నిషన్‌కు చాలా వ్యాల్యూ ఉంటుందని చెప్పక్కర్లేదు.ఇపుడు అన్యా సింగ్ టాలెంట్ ని గుర్తించి ఈ అవార్డు ఇవ్వడంతో ఫుల్ హ్యాపీ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు ఆమె ఫాన్స్.

Tags

Related News

ఆ సినిమాను కొనేవాళ్లే లేరా? రిలీజ్‌కు ముందే రూ.15 కోట్ల నష్టం?

సంక్రాంతి వరకు సినిమాల జాతరే.. ప్రతి వారం కొత్త సినిమాల దండయాత్ర!

విశ్వక్ సేన్ కల్ట్‌లో రక్తపాతమే హైలైటా?

మాస్ బాలయ్యతో ఇరుముడి డైరెక్టర్ ..ఈ కాంబో సెట్ అవుతుందా?

కిల్లర్ సినిమాపై ట్రోలింగ్ చేస్తున్నవాళ్లకు పూర్వజ్ స్ట్రాంగ్ ఆన్సర్!

అబ్బా ఏం లుక్ భయ్యా.. బ్లాక్ అండ్ వైట్‌లో షనాయా కపూర్ గ్లామర్.. అదిరిపోయిందిగా!

అరుదైన ఘనత అందుకున్న నయనతార?

Big Stories

Advertisement
×