E-Paper
Advertisement

పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న వేళ.. చిరంజీవితో ఇద్దరు మాస్టర్లు!

పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న వేళ.. చిరంజీవితో ఇద్దరు మాస్టర్లు!
Advertisement

Chiranjeevi:టాలీవుడ్‌లో గత కొన్ని రోజుల కిందటి వరకు డ్యాన్స్ యూనియన్‌ కి పెద్ద ఎత్తున గొడవలు జరిగిన సంగతి తెల్సిందే .పేరుకి డాన్స్ యూనియన్‌ ప్రెసిడెంట్ సుమలత పేరు మీదిగానే అయినప్పటికి వెనకాల కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ల మధ్యనే అని ఇండస్ట్రీలో జోరుగా టాక్ నడుస్తుంది.ఇదిలా ఉండగా సరిగ్గా ఈ సమయంలోనే వీరిద్దరూ మెగాస్టార్ చిరంజీవితో కలిసి నవ్వుతూ ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడం విశేషం.

శేఖర్ మాస్టర్ విషయానికి వస్తే, ప్రస్తుతం టాలీవుడ్‌లోని టాప్ కొరియోగ్రాఫర్లలో ఆయన ఒకరని చెప్పక్కర్లేదు. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు సూపర్ హిట్ డ్యాన్స్ కంపోజ్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా హీరోల బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా స్టెప్పులు డిజైన్ చేయడం, ట్రెండీ మూమెంట్స్‌తో యూత్‌ను ఆకట్టుకోవడం శేఖర్ మాస్టర్ స్పెషాలిటీ. పెద్ద బడ్జెట్ సినిమాల నుంచి మాస్ ఎంటర్‌టైనర్ల వరకు ఎన్నో చిత్రాలకు పనిచేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటిది చిరంజీవి వంటి సీనియర్ లెజెండరీ స్టార్‌తో కలిసి పనిచేసే ఎన్నో హిట్స్ అందించాడు కూడా.

Advertisement

మరోవైపు జానీ మాస్టర్ సైతం తనదైన డిఫరెంట్ స్టైల్ కొరియోగ్రఫీతో నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల సినిమాల్లోనూ పనిచేస్తూ తన టాలెంట్ చాటుకున్నాడు కూడా.స్పీడ్ గా వేసే స్టెప్పులు, కొత్త కొత్త డ్యాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేయడంలో ఆయన స్టైలే వేరని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.అలా ఎందఱో స్టార్ హీరోల పాటలకు కొరియోగ్రఫీ అందించి ఆడియన్స్ లో తనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ బేస్ సంపాదించుకున్నాడు. ఇలా శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఇద్దరూ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్స్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి అంటేనే మనకు మొదటగా గుర్తుకొచ్చేది డ్యాన్స్. తెలుగు సినిమా ల్లో తనదైన గ్రేస్ తో ఆడియన్స్ ని మైమరపించిన ఆయన, ఎన్నో తరాల డ్యాన్సర్లకు ఇన్స్పిరేషన్ అని చెప్పక తప్పదు.చిరంజీవి సినిమాల్లోని పాటలకు ఉండే క్రేజే వేరు. పాటలోని ప్రతి బీట్‌కు తగ్గట్టుగా ఆయన వేసే స్టెప్పులు, స్క్రీన్‌పై కనిపించే జోష్ అభిమానులను ఎప్పటికీ అలరిస్తూనే ఉంటాయి. అందుకే ఆయనతో కలిసి పనిచేసే కొరియోగ్రాఫర్లకు ఇండస్ట్రీలో మంచి పేరు వస్తుంది.

Advertisement

అయితే, ప్రస్తుతం డ్యాన్స్ యూనియన్ వివాదాల వల్ల వీరిద్దరి పేర్లు వార్తల్లోకి రావడం, అదే సమయంలో చిరంజీవితో ఉన్న ఫోటో వైరల్ కావడం ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచుతుంది. ముఖ్యంగా ఈ ఫోటోలో చిరంజీవిని కౌగిలించుకుని, ఆయనతో కలిసి శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఎంతో సంతోషంగా కనిపించడం ఫ్యాన్స్‌కు మాంచి కిక్కిస్తుంది.

ALSO READ :అన్యా సింగ్‌కు ఎల్లే ఇండియా నుంచి స్పెషల్ ట్రీట్.. ఫుల్ ఖుషీలో బ్యూటీ!

Tags

Related News

సుమను ఇరికించిన ప్రజ్వల్.. ఇంటర్వ్యూలో నవ్వులే నవ్వులు!

అన్యా సింగ్‌కు ఎల్లే ఇండియా నుంచి స్పెషల్ ట్రీట్.. ఫుల్ ఖుషీలో బ్యూటీ!

ఆ సినిమాను కొనేవాళ్లే లేరా? రిలీజ్‌కు ముందే రూ.15 కోట్ల నష్టం?

సంక్రాంతి వరకు సినిమాల జాతరే.. ప్రతి వారం కొత్త సినిమాల దండయాత్ర!

విశ్వక్ సేన్ కల్ట్‌లో రక్తపాతమే హైలైటా?

మాస్ బాలయ్యతో ఇరుముడి డైరెక్టర్ ..ఈ కాంబో సెట్ అవుతుందా?

కిల్లర్ సినిమాపై ట్రోలింగ్ చేస్తున్నవాళ్లకు పూర్వజ్ స్ట్రాంగ్ ఆన్సర్!

Big Stories

Advertisement
×