Cult Movie::’కల్ట్’…మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సరికొత్త కథలతో ప్రయోగాలు చేసే విశ్వక్ ఈసారి మాత్రం ఫుల్ యాక్షన్ జానర్‌లో ఆడియన్స్ ని పలకరించేందుకు రెడీ అయిపొయాడు.
ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయని, సినిమాలోని రక్తపాతం, యాక్షన్ సీన్స్ కారణంగా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసిందని తెలుస్తుంది.దీంతో ఈ సినిమా సో కాల్డ్ కమర్షియల్ సినిమాలకు దూరంగా, కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉండబోతోందని అర్థమవుతుంది.
ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ డీఎస్పీ సంకల్ప్ నాయక్ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండటం విశేషం. తన క్యారెక్టర్ లోని ఇంటెన్సిటీ, యాక్షన్ సీక్వెన్సెస్, పాత్రల మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అవుతాయని ఇప్పటికే చెప్పేశాడు విశ్వక్.
ఈ కుర్ర హీరో గతంలో ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాకు దర్శకత్వం వహించి సక్సెస్ సాధించిన సంగతి తెల్సిందే . ఇప్పుడు మరోసారి దర్శకత్వం వహించిన ‘కల్ట్’తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడా అంటూ క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారు మూవీ లవర్స్.మరో వైపు ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వంటి వెరైటీ సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు కూడా.
ఇక ఈ సినిమా క్యాస్టింగ్ విషయానికి వస్తే ఇందులో విశ్వక్ సేన్‌తో పాటు గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మురళీ శర్మ, తారక్ పొన్నప్ప, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అని చెప్పక తప్పదు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ లాంటి భారీ యాక్షన్ సినిమాలకు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన ఆయన, ‘కల్ట్’ చిత్రానికి కూడా సంగీతం అందిస్తు ఉండటంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.ముఖ్యంగా రవి బస్రూర్ బీజీఎం ఉంటే ఆ యాక్షన్ సీన్స్ వేరే లెవెల్‌లో ఉంటాయని ఇప్పటి నుండే లెక్కలు వేస్తున్నారు మూవీ లవర్స్.
ఇక ఈ సినిమాను అక్టోబర్ 30న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏపీ లో అర్ణబ్ తుఫాన్ బీబత్సం స్ప్రుష్టిస్తుండటం తో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారని తెలుస్తుంది.చూడాలి మరి ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ ద్వారా సినిమాపై అంచనాలను పెంచిన ఈ కుర్ర హీరో ఎలాంటి ఫలితాన్ని రాబడతాడో !
ALSO READ :మాస్ బాలయ్యతో ఇరుముడి డైరెక్టర్ ..ఈ కాంబో సెట్ అవుతుందా?