Killer Movie:కిల్లర్’..పూర్వజ్ దర్శకత్వం వహించి, జ్యోతి పూర్వజ్తో కలిసి ప్రధాన పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.ఇక ఈ సినిమా ఈనెల 30న రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో పూర్వజ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
సినిమా ఇంకా విడుదల కాకముందే దానికి సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్లు, సక్సెస్ టాక్, సక్సెస్ మీట్లపై కొందరు అడుగుతున్న ప్రశ్నలు, చేస్తున్న కామెంట్స్ పై ఒక రేంజ్ లో మండిపడ్డారు.సక్సెస్ మీట్ నిర్వహించడం గురించి మాట్లాడుతుంటే, డబ్బులు ఇస్తానన్నా కూడా ‘అసలు సినిమా సక్సెస్ అవ్వాలిగా’ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారని పూర్వజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం కోటి రూపాయల కలెక్షన్స్ అయినా వస్తాయా అని ఎగతాళి చేయడం ఎంటని తప్పుపట్టారు. ‘నా సినిమా సక్సెస్ అవుతుందో లేదో మీకెందుకు?’ అంటూ ఫైర్ అయ్యారు.సినిమా రిజల్ట్ ,సక్సెస్ అనేది ప్రేక్షకులు థియేటర్లలో చూసి నిర్ణయించాలి తప్ప, విడుదల ముందే ఇలా ఎగతాళి చేయడం ఏంటని మండిపడ్డారు.ఒక సినిమా తీయడం వెనుక ఎంతటి శ్రమ, నమ్మకం, పెట్టుబడి ఉంటాయో తెలీకుండా ఇలా తీర్పులు ఇవ్వడం సరికాదని తన మనసులోని మాటని బయటపెట్టారు.అంతేకాకుండా సోషల్ మీడియాలో ఫేక్ idల చాటున కామెంట్స్,ట్రోల్స్ చేసేవారిపై కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
నిజానికి ఈ మధ్య సినిమాలపై పాజిటివిటీ కన్నా నెగెటివిటీ నే ఎక్కువగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్న తీరు మనకి కనిపిస్తుంది కూడా.సినిమా బాగున్నా బాగోలేదంటూ నెట్టింట స్ప్రెడ్ చేయడంతో ఈ మధ్య వచ్చిన ఒక సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది.ఇక ఇపుడు కిల్లర్ సినిమా పై కూడా ఇలాగే నెట్టింట నెగెటివ్ ప్రచారం జరుగుతుండటంతో ఇలా మండిపడ్డాడు పూర్వాజ్.
ఇక సినిమా విషయానికి వస్తే..జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై పూర్వాజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మించారు.ఇక ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని యు సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 30న రిలీజ్ కానున్న సంగతి తెల్సిందే.
చూడాలి మరి గతంలో ‘మాస్టర్ పీస్’, ‘మాటరాని మౌనమిది’, ‘శుక్ర’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని రాబడతాడో .ఏది ఏమైనా మొత్తానికి ‘కిల్లర్’ సినిమా రిలీజ్ కాకముందే పూర్వజ్ చేసిన ఈ కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాయి.చూడాలి మరి పూర్వాజ్ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో.
ALSO READ :అబ్బా ఏం లుక్ భయ్యా.. బ్లాక్ అండ్ వైట్లో షనాయా కపూర్ గ్లామర్.. అదిరిపోయిందిగా!