BigTV English

Akhanda 2: పవన్ కు భయపడి అఖండ వెనక్కి తగ్గిందా.. ?

Akhanda 2: పవన్ కు భయపడి అఖండ వెనక్కి తగ్గిందా.. ?

Akhanda 2: టాలీవుడ్ లో అందరూ ఎదురుచూస్తున్న సినిమాల్లో అఖండ 2, OG కూడా ఉన్నాయి. టాలీవుడ్ అభిమానులుఎన్నో అంచనాలతో ఈ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోల మధ్య యుద్ధం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ, తెలుగు ఇండస్ట్రీలో బాలయ్యకు, పవన్ కు మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అన్న విషయం తెల్సిందే. అలాంటి ఇద్దరు స్టార్ హీరోలు ఒకే రోజు వస్తున్నారు అంటే ఇండస్ట్రీ మొత్తం వారివైపే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే ఉంది.


నందమూరి బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా అఖండ. కరోనా తరువాత ప్రేక్షకులను  థియేటర్ వైపు తీసుకెళ్లిన సినిమా అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక దీని తరువాత బాలయ్యకు వరుస విజయాలు వచ్చాయి. మొన్న రిలీజ్ అయిన డాకు మహారాజ్ వరకు బాలయ్య పట్టిందల్లా బంగారమే అయ్యింది. అంతేనా అవార్డులు, రివార్డులు.. పద్మభూషణ్ గౌరవం కూడా నడుచుకుంటూ వచ్చింది.

ఇక అలాంటి హిట్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం అఖండ 2.  మొదటి పార్ట్ ను మించి రెండో పార్ట్ ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి  విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి నుంచి కూడా అఖండ 2 .. సెప్టెంబర్ 25 న రిలీజ్ కానుందని ప్రకటించారు. దీని తరువాత పవన్ కళ్యాణ్ OG కూడా అదే రోజు వస్తున్నట్లు ప్రకటించారు.


అన్ని బావుంటే పవన్ కళ్యాణ్ OG గత ఏడాది సెప్టెంబర్ 25 న రావాల్సి ఉంది.కానీ, షూటింగ్ ఇంకా ఫినిష్ కాకపోవడంతో.. అలా అలా వెనక్కి తగ్గుతూ ఈ ఏడాది సెప్టెంబర్ 25 న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈ రెండు సినిమాలు ఒకేరోజు వస్తున్నాయని ప్రకటించడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వీటిలో ఏ సినిమా వెనక్కి తగ్గుతుంది. బాలయ్యకు పవన్ భయపడతాడా.. ? పవన్ కు బాలయ్య భయపడతాడా.. ? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గత కొన్నిరోజులుగా ఈ రెండు సినిమాలు ఏది తగ్గేదేలేదు అంటూ అదేరోజుకు వస్తున్నాయని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఎట్టకేలకు బాలయ్యనే వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఏంటి.. పవన్ కు బాలయ్య భయపడ్డడా.. ? అంటే అది తప్పు. అఖండ 2 పోస్ట్ ప్రొడక్షన్  పనులు ఇంకా పూర్తికాకపోవడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప.. OG కి భయపడి కాదని  బాలయ్య అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఒకే కూటమికి చెందినవారు కూడా కావడంతో బాలయ్య – పవన్ మధ్య   చర్చలు ముగిశాయని, వారు ఒక మాటకు వచ్చాకే OG  సాంగ్ ను రిలీజ్ చేసారని తెలుస్తోంది. మరి OG  సింగిల్ గా వచ్చి ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×