BigTV English

Trump on India: రష్యా నుంచి ఇండియా ఆయిల్ తీసుకుంటే.. ట్రంప్‌కు ఎందుకు మంట? కారణాలు ఇవే

Trump on India: రష్యా నుంచి ఇండియా ఆయిల్ తీసుకుంటే.. ట్రంప్‌కు ఎందుకు మంట? కారణాలు ఇవే

Trump on India: భారత్‌పై తన అసంతృప్తిని మరోసారి బయటపెట్టాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా, దానిలో చాలా భాగాన్ని ఓపెన్ మార్కెట్‌లో అమ్ముతూ పెద్ద లాభాలు తీసుకుంటోంది. వీళ్లకు ఉక్రెయిన్‌లో జరిగే హింస పట్ల ఏమాత్రం చింత లేదు. అందుకే భారత్‌ నుంచి అమెరికాకు వస్తున్న దిగుమతులపై నేను భారీగా టారిఫ్‌లు పెంచుతానని ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దీంతో సోషల్ మీడియాలో ట్రంప్ పై ప్రజలు మండిపడుతున్నారు. రష్యా నుంచి ఇండియా ఆయిల్ తీసుకుంటే ట్రంప్‌కు ఎందుకు మంట అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇండియా- రష్యా చమురు..

భారతదేశం ఎందుకు రష్యా చమురు పట్ల ఆకర్షితమవుతోంది అనే విషయాన్ని మొదటగా చూద్దాం. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా చమురు తక్కువ ధరకు లభించడం ప్రారంభమైంది. 2025 జనవరి నుండి జూన్ వరకు భారతదేశం రోజుకి సగటున 1.75 మిలియన్ బారెల్లుల (చమురు కొలవడానికి ఉపయోగించే ప్రమాణం) రష్యా క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది. ఇది దేశ మొత్తం చమురు అవసరాల్లో దాదాపు 36 నుంచి 40 శాతం వరకు. ఈ కొనుగోళ్లు భారతదేశానికి రెండు కీలక ప్రయోజనాలు తీసుకొచ్చాయి – ఒకటి ద్రవ్యోల్బణ నియంత్రణ, రెండు చమురు దిగుమతులపై ఖర్చు తగ్గించడం.


ఇంకా చెప్పుకోవాల్సిన నిజం ఏంటంటే – 2022, 2023 లో అమెరికా యాజమాన్యం స్వయంగా భారతదేశాన్ని రష్యా చమురు కొనుగోలు చేయమని ప్రైవేటుగా ప్రోత్సహించింది. గ్లోబల్ మార్కెట్ల్లో ధరల స్థిరత్వం కోసం ఇది అవసరమన్నది అప్పటి మాట. కానీ ఇప్పుడు ఆ మాట మారిపోయింది.

ట్రంప్‌కు కోపం ఎందుకు?

ఇందతా సరే గానీ.. ఇప్పుడు ట్రంప్ ఎందుకు కోపంగా ఉన్నారు అన్నది చూస్తే.. ఇది పూర్తిగా ఆయిల్ మార్కెట్ డొమినేషన్ గురించే. ట్రంప్‌కి మద్దతుగా ఉన్న అనేక అమెరికన్ చమురు సంస్థలు ఉన్నాయి. ఇటీవల ఆయన ప్రవేశపెట్టిన పన్ను మినహాయింపుల ప్యాకేజీ ద్వారా ఆయిల్-గ్యాస్ రంగానికి దాదాపు $18 బిలియన్ డాలర్ల ప్రోత్సాహం ఇచ్చారు. ఆయన పాలనలో ఉండగా అమెరికా నుండి భారతదేశానికి క్రూడ్ ఆయిల్ ఎగుమతులు 50% పెరిగాయి. ఇప్పుడు అవి భారత చమురు దిగుమతుల్లో దాదాపు 8% వాటా కలిగి ఉంది.

అంటే, భారత్ రష్యా చమురుపై ఆధారపడకుండా, అమెరికా నుంచి చమురు దిగుమతులను పెంచితే అమెరికాకు రెండవ లాభం – ఒకటి దేశీయ చమురు సంస్థలకు ఆదాయం, రెండవది గ్లోబల్ ఎనర్జీ రంగంపై అమెరికా ప్రభావం పెరగడం.

ట్రంప్ టారిఫ్ మాట..

ట్రంప్ టారిఫ్‌ల మాట ఎందుకు తెచ్చారు అన్నదానికీ కారణం అదే. ఇది శిక్షించే ధోరణి కాదనిపించొచ్చు – కానీ ఇది భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు చేసిన వ్యూహాత్మక చర్య మాత్రమే. అమెరికా భారత ఎగుమతులలో దాదాపు ఐదవ వంతు వాటా కలిగి ఉంది. ఇప్పుడు ట్రంప్ చెప్పే టారిఫ్ పెంపు వస్తే టెక్స్టైల్స్‌, ఫార్మాస్యూటికల్స్‌, ఆటో భాగాలు, ఎలక్ట్రానిక్స్ రంగాలపై నేరుగా ప్రభావం పడుతుంది. ఇండియాకు ఇది వార్షికంగా దాదాపు $18 బిలియన్ డాలర్ల నష్టంగా మారే అవకాశం ఉంది.

మరోవైపు, భారతదేశం రష్యా చమురు కొనుగోలు తగ్గించి మళ్లీ ఖరీదైన ఇతర మార్కెట్ల వైపు మళ్లితే, సంవత్సరానికి కనీసం $11 బిలియన్ డాలర్ల అదనపు ఖర్చు వచ్చే అవకాశముంది. ఇది దేశంలో ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. అంతేకాదు, మధ్య తరగతి, చిన్న పరిశ్రమలపై ఇది నేరుగా ప్రభావం చూపుతుంది.

భారత ప్రభుత్వం కీలక ప్రకటన

ఈ విషయంలో భారత ప్రభుత్వం స్పందిస్తూ ఓ కీలక ప్రకటన చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది – భారతదేశం తక్కువ ధరకే రష్యా చమురును ఎంచుకోవడమొక ఆర్థిక అవసరం. పశ్చిమ దేశాలు గతంలో తమ చమురు అమ్మకాలను యూరప్ వైపు మళ్లించాయి. దాంతో భారత్ ఆ సమయంలో రష్యా వైపు మళ్లిందని, అప్పట్లో అమెరికా స్వయంగా ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చిందని గుర్తు చేసింది.

ఇంకా MEA చెప్పిన విషయం ఏమిటంటే – యూరోప్ దేశాలు 2024లో రష్యాతో గల వ్యాపారం భారత్ కన్నా భారీగా ఉందని, అమెరికా కూడా యురేనియం, ఫెర్టిలైజర్స్, పల్లాడియం వంటి పదార్థాలను రష్యా నుంచి కొనుగోలు చేస్తూనే ఉందని వివరించింది. ఇది చూసినప్పుడు స్పష్టమవుతోంది – భారత్ తన చమురు వ్యూహాన్ని జియోపాలిటికల్ ఒత్తిళ్ళకి లోనవకుండా, స్వతంత్రంగా, తన ప్రయోజనాల దృష్టితో నిర్మించుకుంది. ఆర్థిక భద్రత, వినియోగదారుల ప్రయోజనం, మార్కెట్ స్థితిగతులు – ఇవే దిశానిర్దేశకాలు.

కాబట్టి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అర్థం చేసుకోవడానికి ఒకే కోణంలో చూస్తే.. ఇది చమురు రాజకీయాలు, వ్యాపార ఒత్తిళ్ళ మిశ్రమం. ట్రంప్ తీరులో మాస్కో పట్ల కోపం కన్నా – అమెరికా తన జియోఎకనామిక్ ప్రయోజనాలను ఎలా మరింత పటిష్టం చేసుకోవాలన్న అజెండానే ఎక్కువగా కనిపిస్తోంది.

Related News

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

US Flights Cancelled: అమెరికాలో నిలిచిపోయిన వందలాది విమానాలు.. కారణం ఇదే!

H-1B Visa: రూ. 88 లక్షలు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Russia Earthquake: రష్యాని కుదిపేసిన భూకంపం.. 7.4 గా నమోదు, ఆ తర్వాత ఇండోనేషియాలో

TikTok Deal: టిక్‌టాక్ అమెరికా సొంతం!..యువత ఫుల్ ఖుషీ అన్న ట్రంప్

Anti-immigrant Sentiment: లండన్ నిరసనలు.. ఎవరికి పాఠం, ఎవరికి గుణపాఠం?

Big Stories

×