Indin Railways: సుదూర రైలు ప్రయాణాలు చేసే ప్రయాణీకులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. బడ్జెట్ ను బట్టి ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. తత్కాల్ బుకింగ్ చివరి నిమిషంలో టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. రైలు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, సౌకర్యవంతంగా మార్చడానికి రైల్వే సంస్థ కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లను రిజర్వ్ చేసింది. టిక్కెట్లు రిజర్వ్ చేసుకోలేని ప్రయాణీకులు ఈ రైళ్లలోని నాన్ రిజర్వ్ స్లీపర్ కోచ్ లలో ప్రయాణించవచ్చు. అయితే, ఈ సౌకర్యం కొన్ని స్టేషన్ల మధ్య మాత్రమే అందుబాటులో ఉంది. ప్రయాణీకులు రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్ల నుండి ఈ కోచ్‌ల కోసం టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. సీజన్ టిక్కెట్లు ఉన్నవారు కూడా ఈ కోచ్‌లలో ప్రయాణించవచ్చు.
రిజర్వేషన్ టికెట్ లేకుండా స్లీపర్ కోచ్ లలో ప్రయాణించే రైళ్లు
సౌత్ రైల్వే పరిధిలో నడుస్తున్న పలు రైళ్లలో ప్రత్యేక స్లీపర్ కోచ్ లు అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఈ రైళ్లు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿16382 – కన్యాకుమారి – పూణే ఎక్స్ ప్రెస్: S5, S6 కోచ్ లు
⦿ 12624 – తిరువనంతపురం సెంట్రల్ – చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్: S7 కోచ్
⦿16629 – తిరువనంతపురం సెంట్రల్ – మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్: S8, S9 కోచ్ లు
⦿ 16347 – తిరువనంతపురం సెంట్రల్ – మంగళూరు సెంట్రల్ ఎక్స్ ప్రెస్: S8 కోచ్
⦿ 22640 – అలప్పుజ – చెన్నై సెంట్రల్ సూపర్‌ఫాస్ట్: S7 కోచ్
⦿ 12601 – చెన్నై సెంట్రల్ – మంగళూరు సెంట్రల్ సూపర్ ఫాస్ట్: S8, S9 కోచ్‌లు
⦿ 12602 – మంగళూరు సెంట్రల్ – చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్: S8, S9 కోచ్‌లు
⦿ 16630 – మంగళూరు సెంట్రల్ – త్రివేండ్రం సెంట్రల్ ఎక్స్ ప్రెస్: S 6 కోచ్
⦿ 16348 – మంగళూరు సెంట్రల్ – త్రివేండ్రం సెంట్రల్ ఎక్స్ ప్రెస్: S8 కోచ్
⦿ 22638 – మంగళూరు సెంట్రల్ – చెన్నై సెంట్రల్ సూపర్‌ఫాస్ట్: S9 కోచ్
⦿ 20635 – చెన్నై ఎగ్మోర్ – కొల్లం సూపర్‌ఫాస్ట్: S10, S11 కోచ్‌లు
⦿ 20636 – కొల్లం – చెన్నై ఎగ్మోర్ సూపర్‌ఫాస్ట్: S11 కోచ్
⦿ 22637 – చెన్నై సెంట్రల్ – మంగళూరు సెంట్రల్ సూపర్‌ఫాస్ట్: S4 కోచ్
⦿ 16528 – కన్నూర్ – యశ్వంత్‌పూర్ ఎక్స్ ప్రెస్: S7, S8 కోచ్‌లు
⦿ 22639 – చెన్నై సెంట్రల్ – అలప్పుజ సూపర్‌ఫాస్ట్: S10 కోచ్
⦿ 16751 – చెన్నై ఎగ్మోర్ – రామేశ్వరం ఎక్స్ ప్రెస్: S11,S12 కోచ్‌లు
⦿ 16752 – రామేశ్వరం – చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్: S11, S12 కోచ్‌లు
⦿ 16159 – చెన్నై ఎగ్మోర్ – మంగళూరు సెంట్రల్ ఎక్స్ ప్రెస్: S10, S11 కోచ్‌లు
⦿ 16160 – మంగళూరు సెంట్రల్ – చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్: S8 కోచ్, S9, S10,S11 కోచ్‌లు.
⦿ 16235 – తూత్తుకుడి – మైసూరు ఎక్స్ ప్రెస్: S9, S10 కోచ్ లు.
⦿ 16525 – కన్యాకుమారి – బెంగళూరు ఎక్స్ ప్రెస్: S6, S7 కోచ్ లు.
⦿ 17229 – తిరువనంతపురం సెంట్రల్ – సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్: S8 కోచ్.
⦿ 12689 – చెన్నై సెంట్రల్ – నాగర్‌కోయిల్ జంక్షన్ ఎక్స్ ప్రెస్: S10, S11 కోచ్ లు
⦿ 16346 – తిరువనంతపురం సెంట్రల్ – ముంబై LTT ఎక్స్ ప్రెస్: S6 కోచ్
⦿ 16127 – చెన్నై ఎగ్మోర్ – గురువాయూర్ ఎక్స్ ప్రెస్: S11 కోచ్
⦿16128 – గురువాయూర్ – చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్: S11 కోచ్
⦿ 16203 చెన్నై సెంట్రల్ – తిరుపతి ఎక్స్ ప్రెస్: S8, S9, S10 కోచ్‌లు
⦿ 16512 – కన్నూర్ – బెంగళూరు ఎక్స్ ప్రెస్: S5, S6,S7 కోచ్ లు
⦿16729 – మధురై – పునలూర్ ఎక్స్ ప్రెస్: S6, S7 కోచ్ లు
⦿ 16730 – పునలూర్ – మదురై ఎక్స్ ప్రెస్: S6, S7 కోచ్‌లు
⦿ 16527 – యశ్వంత్ పూర్ – కన్నూర్ ఎక్స్ ప్రెస్: S7, S8 కోచ్‌లు
⦿ 13352 – అలప్పుజా – ధన్ బాద్ ఎక్స్ ప్రెస్: S5,S6 కోచ్‌లు
Read Also: ఆర్టీసీ స్ట్రైక్.. ప్రత్యేక రైళ్లను సిద్ధం చేస్తున్న రైల్వే!