Vietnam Floods: వియత్నాంలో వరదల విలయం కొనసాగుతుంది. ఇప్పటికే దక్షిణ చైనాను అతలాకుతలం చేసిన మాట్మో తుఫాన్ వియత్నాంను కూడా పూర్తిగా దెబ్బతీసింది. మాట్మో తుఫాన్ ప్రభావంతో థాయింగేన్ ప్రావిన్స్‌లో భీకర వర్షాలు పడటంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తభించిపోయింది. వరదల్లో రెండు లక్షలకు పైగా ఇళ్లు.. వందలాది కార్లు నీట మునిగాయి. వరదలు కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు స్కూళ్లు, మార్కెట్లు, హాస్పిటల్స్ కూడా మూసివేశారు. రెస్క్యూ చర్యలకు సైతం ఆటంకంగా మారింది. సహాయచర్యల కోసం 30వేల మంది సిబ్బందిని, వేలాది పడవలను ఏర్పటుచేసినట్టు సైన్యం తెలిపింది. ప్రస్తుతం విమానాల సహాయంతో బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ వరదల్లో 50 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తుంది.